Om Bheem Bush Collections : బాక్సాఫీస్ పై ఓం భీమ్ బుష్ బీభత్సం.. ఇప్పటికి ఎంత తెచ్చింది అంటే..?

Om Bheem Bush Collections హుషారు, రౌడీ బోయ్స్ డైరెక్ట్ చేసిన హర్ష కొనుగంటి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఓం భీం బుష్. వి సెల్యులాయిడ్ బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమాలో శ్రీ విష్ణు

Published By: HashtagU Telugu Desk
Om Bheem Bush Collections Hungama 4 Days Total Collections

Om Bheem Bush Collections Hungama 4 Days Total Collections

Om Bheem Bush Collections  హుషారు, రౌడీ బోయ్స్ డైరెక్ట్ చేసిన హర్ష కొనుగంటి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఓం భీం బుష్. వి సెల్యులాయిడ్ బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమాలో శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కలిసి నటించారు. లాస్ట్ ఫ్రై డే రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కేవలం టాక్ లోనే కాదు వసూల్లతో కూడా ఈ సినిమా అదరగొట్టేస్తుంది.

తొలి రోజు 4 కోట్ల పైన గ్రాస్ రాబట్టిన ఓం భీం బుష్ వీకెండ్ వరకు బాగానే రాబట్టింది. అంతేకాదు వీక్ డే అయిన మండే హోలీ అవ్వడంతో ఆరోజు కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఫైనల్ గా 4 రోజుల్లో ఓం భీం బుష్ సినిమా 21.75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సూపర్ అనిపించుకుంది.

ఈ సినిమా వసూళ్లు చూస్తుంటే ఫైనల్ రన్ లో భారీ మొత్తాన్నే రాబట్టేలా ఉన్నాయి. రోజు రోజుకి ఈ సినిమా వసూళ్లు బాగా వస్తున్నాయి. సామజవరగమన హిట్ తో శ్రీ విష్ణు సక్సెస్ జోష్ లో ఉండగా ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

  Last Updated: 26 Mar 2024, 06:32 PM IST