Okkadu Re-released: రాజమండ్రిలో ఒక్కడు రీ-రిలీజ్.. థియేటర్స్ హౌస్ ఫుల్!

మహేష్ బాబు ఒక్కడు మూవీ అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాలలో ఒకటి.

Published By: HashtagU Telugu Desk
Okkadu

Okkadu

మహేష్ బాబు ఒక్కడు మూవీ అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాలలో ఒకటి. ఒక్కడు పై ఉన్న క్రేజ్ కారణంగా మళ్లీ రీరిలీజ్ చేశారు. మంగళవారం రాజమండ్రిలో షోలు హౌస్‌ఫుల్‌గా సాగడంతో మహేశ్ అభిమానులు పండుగ చేసుకున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు ఎంట్రీ సీన్‌పై అభిమానులు సందడి చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఆగస్ట్ 9న నటుడి పుట్టినరోజును పురస్కరించుకుని థియేటర్లలో ఒక్కడు కోసం ప్రత్యేక ఫ్యాన్ షోలు వేయనున్నట్టు దర్శక-నిర్మాత MS రాజు ఇటీవల ప్రకటించారు.

ఒక్కడు 2003లో విడుదలైంది. ఈ చిత్రం అనేక రికార్డులను బద్దలు కొట్టగలిగింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్-యాక్షన్ చిత్రం తమిళంలో ఇళయతలపతి విజయ్ ప్రధాన పాత్రలో రీమేక్ చేయబడింది. రీమేక్ వెర్షన్ కూడా పెద్ద హిట్ అయింది. మహేష్ బాబు నటించిన ఈ చిత్రం లో కబడ్డీ ఆటగాడిగా అజయ్ ఒక రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ కోసం కర్నూలును సందర్శించి, భూమికా చావ్లా పోషించిన స్వప్నను క్రూరమైన ఫ్యాక్షనిస్ట్‌ని బలవంతంగా వివాహం చేసుకోకుండా కాపాడుతాడు. ఈ సినిమా విడుదలై సంవత్సరాలు గడుస్తున్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు.

  Last Updated: 03 Aug 2022, 02:47 PM IST