టైటిల్ చూడగానే మళ్లీ గుణశేఖర్ డైరెక్షన్ లో మహేష్ సినిమానో.. లేదా మహేష్, భూమిక కలిసి సినిమా చేస్తున్నారనో అనుకుంటారు. కానీ ఇక్కడ ఆ రెండు కాకుండా మరోటి జరుగుతుంది. ఒక్కడు సినిమా అంటే సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లో చాలా ప్రత్యేకమైన సినిమా. ఆ సినిమాతోనే మహేష్ మాస్ ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. గుణశేఖర్ (Gunasekhar) డైరెక్షన్ లో తెరకెక్కిన ఆ సినిమా తర్వాత మహేష్ లెవెల్ మారిపోయింది.
ఆ సినిమాలో మహేష్ సరసన నటించిన భూమిక ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టింది. ఐతే ఇన్నేళ్ల తర్వాత భూమిక మళ్లీ ఒక్కడు (Okkadu) డైరెక్టర్ గుణశేఖర్ తో కలిసి పనిచేస్తున్నారు. 2001 లో Mahesh ఒక్కడు సినిమా రాగా 23 ఏళ్ల తర్వాత మళ్లీ ఆయన డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో భూమిక నటిస్తుంది.
గుణశేఖర్ అందరు కొత్త వాళ్లతో యుపోరియా అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా లో భూమిక (Bhumika) నటిస్తుంది. రీసెంట్ గా సినిమా షూటింగ్ లో ఆమె పాల్గొన్నది. ఐతే ఒక్కడు కాంబో రిపీట్ అంటూ గుణశేఖర్ అంటూ టీం భూమిక ఎంట్రీని భారీగా చూపిస్తున్నారు. సినిమాలో ఆమెది వన్ ఆఫ్ ది లీడ్ రోల్ అని తెలుస్తుంది.
శాకుంతలం సినిమాతో బాక్సాఫీస్ ఫెయిల్యూర్ అందుకున్న గుణశేఖర్ తన నెక్స్ట్ సినిమా ఒక ప్రయోగాత్మకంగా ఉండాలని యుపోరియా చేస్తున్నాడు. మరి భూమిక సెంటిమెంట్ కలిసి వచ్చి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి.