Site icon HashtagU Telugu

Lokesh : రజినీకాంత్ ‘కూలీ’ కోసం లోకేష్ షాకింగ్ రెమ్యునరేషన్..!

Rajinikanth, Coolie Movie

Rajinikanth, Coolie Movie

Lokesh : సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ చిత్రం ‘కూలీ’ ప్రస్తుతం సౌతిండియన్ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేపుతోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, శైలీ, స్కేలు పరంగా అభిమానులను ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా, సినిమా మీద మరింత హైప్ క్రియేట్ చేసింది. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ వరుస ఇంటర్వ్యూలతో ప్రమోషన్ల దశను ముమ్మరం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన రెమ్యునరేషన్ గురించి స్పందించారు. “ఈ సినిమా కోసం నేను రూ.50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాను. ఇది కొందరికి ఎక్కువగా అనిపించవచ్చు. కానీ నా గత చిత్రం ‘లియో’ బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లు వసూలు చేసింది. కాబట్టి, నా సినిమాల రేంజ్ పెరిగింది, కలెక్షన్లు డబుల్ అయ్యాయి. అలా రెమ్యునరేషన్ కూడా డబుల్ కావడం సహజమే” అంటూ లోకేష్ స్పష్టత ఇచ్చారు.

తమిళ సినీ పరిశ్రమలో దర్శకులుగా ఇప్పటి వరకు శంకర్ వంటి దిగ్గజులే ఈ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఆ లెవెల్‌కి లోకేష్ చేరడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ స్టార్ క్యాస్టింగ్ కారణంగా కూడా సినిమాకు బడ్జెట్ భారీగా పెరిగినట్లు సమాచారం.

తాజా ఇంటర్వ్యూలో లోకేష్ మాట్లాడుతూ, ఈ చిత్రానికి టీజర్ ఉండదని, బదులుగా ఆగస్టు 2న ట్రైలర్‌ను నేరుగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. “సినిమాకు ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విడుదలకు ముందు ఈ హైప్‌ను మరింత పెంచేందుకు ట్రైలర్ ఒక మెయిన్ టూల్‌గా పని చేస్తుంది” అన్నారు.

సినిమా పేరు ‘కూలీ’ అయినా… వసూళ్ల పరంగా కోట్లు కుమ్మరిస్తుందని అభిమానులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రజినీకాంత్ కెరీర్‌లో మరో ఘనత సాధించే ప్రయత్నంగా ఈ చిత్రం నిలవనుందని భావిస్తున్నారు. భారీ తారాగణం, విలక్షణ దర్శకుడు, గట్టి బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ‘కూలీ’ ఫైనల్‌గా థియేటర్లలో ఎలా పరుగు పెడుతుందో చూడాల్సి ఉంది.

ISRO : అంతరిక్షంలో అరుదైన ఘనత సాధించిన శుభాంశు శుక్లా