Site icon HashtagU Telugu

Payal Rajput: అయ్యో పాయల్ రాజ్ పుత్… ఇంత పెద్ద వ్యాధితో బాధపడుతోందా!

Payal Rajput .1.771484

Payal Rajput .1.771484

Payal Rajput: తెలుగు సినీ ప్రియులకు పాయల్ రాజ్ పుత్ పేరు తెలియంది కాదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో తన కెరీర్ ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే బోల్డ్ పర్ఫామెన్స్ తో అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎక్కువగా ఈమెకు బోల్డ్ సినిమాలోనే అవకాశాలు రావడంతో వచ్చిన అవకాశానాల సద్వినియోగం చేసుకొని తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది.
అయితే తాజాగా ఇన్స్టాలో ఓ పోస్టు పెట్టి అందరినీ విషాదంలోకి దిపింది ఈ ముద్దుగుమ్మ.

పాయల్ రాజ్ పుత్ తనకు కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లుగా తాజాగా ఇంస్టాగ్రామ్ లో రెండు ఫోటోలను షేర్ చేసింది. తన ఇంట్లోనే సెలైన్ పెట్టుకున్నట్లుగా ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ తన హెల్త్ అప్డేట్లు తెలిపింది. ఈ మేరకు ఒక నోట్ కూడా రాసుకుంది. నేను చాలా తక్కువగా నీరు తాగడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్ అయ్యింది. ఫలితంగా కాస్త అనారోగ్యానికి గురయ్యాను ప్రస్తుతం అందుకు ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాను. యాంటీబయోటిక్స్ లాస్ట్ డోస్ తీసుకున్నాను మళ్ళీ తిరిగి బ్యాక్ బౌన్స్ అయ్యేందుకు సిద్ధంగా ఉండాలని తెలియజేస్తోంది పాయల్.

సడన్ గా తన హెల్త్ పై ఇలా అప్డేట్ ఇవ్వడంతో అభిమానులు కాస్త ఆందోళన పడుతున్నారు. తన చేతికి సెలైన్ నీడిల్ ని చూసి తట్టుకోలేకపోతున్నామంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.