Site icon HashtagU Telugu

OG Movie Talk : OG టాక్ వచ్చేసిందోచ్..యూఎస్ ప్రేక్షకులు ఏమంటున్నారంటే !!

Og Talk

Og Talk

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఓజీ (OG) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన క్షణం నుంచే థియేటర్ల వద్ద అభిమానుల సందడి పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమాపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ నుంచి క్లైమాక్స్ వరకూ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను ఉర్రూతలూగించిందని చెపుతున్నారు.

Deepika Padukone: హాలీవుడ్ సినిమా కోసం ప్ర‌భాస్ మూవీని వ‌దులుకున్న దీపికా ప‌దుకొణె?!

అభిమానుల అంచనాలకు తగ్గట్టే పవన్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటనకు భేష్ అనిపించేలా ఉందని అమెరికా ప్రేక్షకులు పేర్కొంటున్నారు. ఆయన స్టైల్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సన్నివేశాలు థియేటర్లలో ఉర్రూతలూగేలా చేశాయని అంటున్నారు. ముఖ్యంగా ఎలివేషన్ సీన్స్ వస్తే అభిమానులు సీట్లపై నిలబడి చప్పట్లు కొట్టాల్సిందే అంటున్నారు. ఫస్ట్ హాఫ్ యాక్షన్‌తో నింపబడగా, సెకండ్ హాఫ్‌లో ఎమోషన్స్ , పవర్‌ఫుల్ ఎలివేషన్స్ సమపాళ్లలో మిళితమై ఉండటంతో సినిమా ఆద్యంతం ఎక్కడా బోర్ కొట్టలేదని చెబుతున్నాయి.

టెక్నికల్ పరంగా దర్శకుడు సుజీత్ టేకింగ్, విజువల్స్, థమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రత్యేకమైన బలం అందించాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సినిమాటోగ్రఫీ స్థాయిని మరో మెట్టుపైకి తీసుకెళ్లగా, కథనం నిర్మాణం ప్రేక్షకులను కట్టిపడేసిందని చెప్పబడుతోంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశం పవన్ కళ్యాణ్ నటనతో కలసి ప్రేక్షకుల హృదయాలను కదిలించిందని రివ్యూలలో హైలైట్ అవుతోంది. మొత్తంగా అమెరికాలో వచ్చిన తొలి సమీక్షలు ‘ఓజీ’ సినిమాను పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలబెట్టే అవకాశముందని సూచిస్తున్నాయి.

Exit mobile version