అటు రాజకీయాలు ఇటు సినిమాలు రెండిటినీ బ్యాలెన్స్ చేయడంలో పవన్ (Pawan Kalyan) కాస్త కంగారు పడుతున్నా ప్రజలకు సేవ చేయడానికే మొదటి ప్రాధాన్యత అని ఎన్నికల టైం లో సినిమాలన్నిటికీ లాంగ్ బ్రేక్ ఇచ్చాడు. త్వరలో ఏపీలో ఎలక్షన్స్ జరుగనున్న సందర్భంగా పవన్ ఫోకస్ అంతా ఆ ఎన్నికల మీద ఉంది. అయితే ఈ టైం లో సినిమా గురించి ఆలోచించేంత తీరిక లేదు.
ఏదైనా సరే ఎన్నికల ముగిసిన తర్వాతే అన్నట్టుగా పవన్ అనుకుంటున్నాడట. అయితే ఆఫ్టర్ ఎలక్షన్స్ అయినా కూడా పవన్ సినిమాలకు సరైన ప్రియారిటీ ఇస్తారా అన్నది చెప్పడం కష్టం. అందుకే పవన్ ఓజీ నిర్మాతలు పవన్ ని ఒక 30 రోజుల డేట్స్ అడుగుతున్నారట. ఆఫ్టర్ ఎలక్షన్స్ ఒక నెల రెండు నెలలు గ్యాప్ ఇచ్చి ఒక 30 రోజులు డేట్స్ ఇస్తే పవన్ ఓజీ ని పూర్తి చేసే అవకాశం ఉందట.
అందుకే పవన్ ఓజీ మేకర్స్ ఆయన్ను ఒక 30 రోజుల టైం ఇవ్వమని అడుగుతున్నారట. ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ముందే డేట్స్ లాక్ చేసి పెట్టుకుంటే సినిమాను పూర్తి చేయొచ్చని మేకర్స్ ప్లాన్. ఆల్రెడీ ఓజీ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ లాక్ చేశారు. సో పవన్ త్వరగా వస్తే పని ముగించేయాలని చిత్ర యూనిట్ రెడీగా ఉంది.