ఓజి మొదటి పాట విడుదలతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఓజి’ (OG) సినిమా ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. ఈ నెల 2వ తేదీన ఈ సినిమాలోని మొదటి పాట విడుదల (OG 1st Song) కానుంది. థమన్ స్వరపరిచిన ఈ పాటలో ఆంగ్ల పదాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. గతంలో ‘ఖుషి’ చిత్రంలోని ‘ఏ మేరా జహా’ పాటలో హిందీ పదాలు, ‘తమ్ముడు’ చిత్రంలోని ‘లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ది మిర్రర్’ పాటలో ఆంగ్ల పదాలు ప్రయోగించి అద్భుతమైన ఫలితాలను పొందారు. ఈసారి ‘ఓజి’ టైటిల్ సాంగ్ ట్యూన్, లిరిక్స్ కూడా అంతకు మించి అనేలా ఉన్నాయని తాజా సమాచారం. అభిమానులు ‘ఓజి’పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Actres Radhika: ప్రధాన నటి రాధికా డెంగ్యూ జ్వరం: నాలుగు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స
‘హరిహర వీరమల్లు’ (HHVM ) చిత్రం ఫలితం పవన్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రీమియర్ల నుంచే ప్రతికూల ప్రచారం మొదలై, VFX మార్పులు చేసినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. సినిమాకు ఫ్లాప్ ముద్ర పడినా, దాని స్థాయి ఎంత అనేది మరో వారం రోజుల్లో స్పష్టమవుతుంది. ఈ గాయాన్ని నయం చేసే బాధ్యత ఇప్పుడు ‘ఓజి’పైనే ఉంది. సెప్టెంబర్ 25న విడుదల తేదీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పదే పదే నొక్కి చెబుతోంది, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని సంకేతాలు ఇస్తోంది. ‘అఖండ 2’ కూడా అదే పట్టుదల మీద ఉంది.
India Post : తపాలా శాఖ కీలక నిర్ణయం.. రిజిస్టర్డ్ పోస్టు స్థానంలో స్పీడ్ పోస్టు విధానం..
హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ సినిమాలకు భారీ బిజినెస్ జరగడం కొత్తేమీ కాదు. అయితే ‘ఓజి’కి మాత్రం ఈసారి అంతకు మించి ఆఫర్లు వస్తున్నాయి. కొన్ని ఏరియాలకు సంబంధించి టాప్ డిస్ట్రిబ్యూటర్లు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతుండటంతో ఎవరికి ఫైనల్ చేయాలో తెలియక నిర్మాత దానయ్య వేచి చూసే ధోరణిలో ఉన్నారట. ఆగస్టు 2న విడుదలయ్యే పాట కనుక చార్ట్‌బస్టర్ అయితే పవన్ అభిమానులకు కొత్త ఉత్సాహం వస్తుంది. ‘గతం గతః’ అనుకుంటూ ‘ఓజి’ మేనియాలో మునిగిపోతారు. విడుదలకి ఇంకా 55 రోజులే ఉన్న నేపథ్యంలో, డీవీవీ బృందం నాన్‌స్టాప్ ప్రమోషన్లతో సోషల్ మీడియాను హోరెత్తించడానికి సిద్ధంగా ఉంది.