Site icon HashtagU Telugu

OG Records : విజయవాడలో ‘ఓజీ’ ఆల్‌టైమ్ రికార్డ్

Og Ticket Price

Og Ticket Price

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’(OG) సినిమా విడుదలకు ముందు నుంచే అభిమానుల్లో ఉత్సాహం, అంచనాలు ఊపందుకున్నాయి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాలో పవన్ ఓజాస్ గంభీర అనే శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నాడు. పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, పాటలు, ట్రైలర్ ఒక్కోటి ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహం నింపగా, సినిమా థియేటర్లలో రిలీజ్ కానుందనే క్షణాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ బోర్డు నుంచి ‘A’ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే హయ్యస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించడంతో రికార్డులు తిరగరాయబోతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రత్యేకంగా, ప్రీమియర్ షో టిక్కెట్లు తెలుగు రాష్ట్రాల్లో భారీగా అమ్ముడవుతున్నాయి.

Fight Breaks : గ్రౌండ్ లో శృతిమించుతున్న పాక్ ఆటగాళ్ల తీరు..

విజయవాడ నగరం ఈ హైప్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. నగరంలోని 8 స్క్రీన్లలో జరుగుతున్న ప్రీమియర్ షోలకే 4,286 టిక్కెట్లు అమ్ముడై రూ.42 లక్షల పైగా వసూళ్లు సాధించడం రికార్డుగా నిలిచింది. ఇది ఇప్పటివరకు ఏ హీరో చిత్రానికి లేని స్థాయి వసూళ్లని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. విజయవాడతో పాటు పరిసర ప్రాంతాలన్నింటికీ కలిపి సుమారు 64 స్క్రీన్లలో ప్రీమియర్ షోలు ప్రదర్శించబడుతుండగా, మొత్తంగా రూ.1.6 కోట్ల వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఒకే నగరంలో ఇంత డిమాండ్ ఉంటే, ఆంధ్ర, తెలంగాణ వ్యాప్తంగా మరింతగా ప్రేక్షకులు థియేటర్లకు తరలివచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ప్రత్యేకించి గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్‌కు ఉన్న అభిమానుల క్రేజ్ వేరే రేంజ్‌లో ఉంటుంది. రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం వంటి పట్టణాల్లో ప్రీమియర్ షో టిక్కెట్లు గంటల్లోనే అమ్ముడైపోవడం దీన్ని స్పష్టంగా నిరూపిస్తోంది. చాలాచోట్ల టిక్కెట్లు బల్క్‌గా బుక్ చేసి బ్లాక్‌లో అమ్మడం వల్ల ధరలు పెరిగి, అమలాపురంలో ఒక్కో టిక్కెట్ రూ.7 వేల వరకు వెళ్లినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ డిమాండ్ చూసి పవన్ ప్రభావం ఇంకా ఎక్కడికీ తగ్గలేదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా, ‘ఓజీ’ తొలిరోజే రూ.150 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తుండటంతో, ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే కాకుండా తెలుగు సినిమా బాక్సాఫీస్ చరిత్రలో కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Exit mobile version