Site icon HashtagU Telugu

OG Movie: పవన్ ఓజి అంటే అసలు అర్థం ఇదే.. అంచనాలు మామూలుగా లేవుగా?

Og Movie

Og Movie

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం పవన్ ఒకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటూనే మరొకవైపు సినిమాలలో నటిస్తున్నారు. అయితే మొన్నటి వరకు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వచ్చిన పవన్ ప్రస్తుతం పూర్తి స్థాయిలో రాజకీయలపై దృష్టి పెట్టారు. ఇకపోతే ప్రస్తుతం పవన్ ఓజీ సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. మాఫియా బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. 70 శాతం షూటింగ్‌ ని పూర్తి చేసుకున్న ఈ మూవీ పవన్‌ కళ్యాణ్‌ డేట్స్ కోసం వెయిట్‌ చేస్తున్నారు మూవీ మేకర్స్.. ఆయన ఎన్నికల్లో బిజీగా ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join
మరో రెండు నెలలు షూటింగ్‌లో పాల్గొనే అవకాశం లేదు. కానీ ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు లీక్‌ అవుతూనే ఉన్నాయి. ఓజీ అంటే అర్థం ఏమిటి? అన్న విషయం తెలియక చాలామంది ఇక ఆలోచిస్తూ ఇప్పటికే ఈ విషయం గురించి ఎన్నోసార్లు సోషల్ మీడియా వేదికగా చర్చించుకున్నారు. దే కాల్‌ హిమ్‌ ఓజీ అంటూ ట్యాగ్‌ లైన్‌ ఇస్తున్నారు మేకర్స్. కానీ దాని అర్థం ఏంటి అనేది మాత్రం క్లారిటీ లేదు. ఇది కొరియన్‌ పదం అని, జపాన్‌ వర్డ్ అంటూ ప్రచారం జరిగింది. మార్షల్‌ ఆర్ట్స్ ప్రధానంగా సినిమా సాగుతుందని, ఇందులో పవన్‌ లుక్‌ని కూడా విడుదల చేశారు. ఇది సినిమాపై మరింత ఆసక్తిని, అంచనాలను పెంచింది. ఆ మధ్య హంటింగ్‌ చితా పేరుతో విడుదల చేసిన గ్లింప్స్ పూనకాలు తెప్పించేలా ఉంది.

Also Read; Balakrishna: బాలయ్య బాబు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. NBK109కీ టైటిల్ ఫిక్స్?

ఇప్పటి వరకు పవన్‌ని ఇలా చూడలేదనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఓజీ అంటే అర్థమేంటి అన్నది ఇప్పుడు వైరల్‌గా మారింది. అది పవన్‌ కళ్యాణ్‌ పాత్రని ప్రతిబింబిస్తుందని, ఆయన పాత్ర నేమ్‌ అని తెలుస్తుంది. ఓజీ అంటే ఓజాస్‌ గాంభీర. అది సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ పాత్ర పేరు అట. ఈ పేరుతో సినిమాలో ఒక పాట కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇక సినిమాలో పవన్‌ పాత్రలో మూడు షేడ్స్ ఉంటాయట. 80, 90 లో మాఫియా డాన్‌గా, యూనియన్‌ లీడర్‌గా, మార్షల్‌ ఆర్ట్స్ ట్రైనర్‌గా కనిపిస్తారట. సినిమాలో ఇంటర్వెల్‌ సీన్‌ మైండ్‌ బ్లోయింగ్‌ అనేలా ఉంటుందని, సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తుందట. కాగా ఇప్పటికీ ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. వీటితోపాటు ఈ సినిమా నుంచి విడుదలవుతున్న ఒక్కొక్క అప్డేట్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.

Also Read: Pushpa 2: యశ్ రికార్డ్ ని బన్నీ బద్దలు కొట్టనున్నాడా.. పై చేయి మాత్రం ఆ హీరోదే!