పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏకకాలంలో రాజకీయాలతో పాటు సినిమాల్లో బిజీగా ఉన్న హీరో. ఇప్పటికే ప్రకటించిన సినిమాలను పూర్తి చేసేందుకు కృషి చేస్తూ, కొత్త సినిమాలకు పచ్చజెండా ఊపుతూ, మరోవైపు రాజకీయాలకు సమయం కేటాయిస్తూ క్షణం తీరిక లేకుండా కాలంతో పరుగులు తీస్తున్నారు. తాజాగా పవన్ నటించనున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ‘ఓజీ’ (OG) ఒకటి. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ కొద్దిరోజుల క్రితం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభం కాగా ముంబైలో ఉన్న మూవీ యూనిట్ తో పవన్ కలిశారు.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఈ సినిమాలో హీరోయిన్ (Heroine)గా ఎవరు నటిస్తారనే దానిపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు ఆ ప్రశ్నకు చిత్ర యూనిట్ సమాధానం ఇచ్చింది. నేచురల్ స్టార్ నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టిన బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్. ‘ఓజీ’లో ఈ క్యూటీ హీరోయిన్‌గా ఎంపిక అయింది. పవన్ సరసన ప్రియాంకా అరుల్ మోహన్ నటిస్తున్నట్లు చిత్ర బృందం అనౌన్స్ చేసింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ముంబైలో స్టార్ట్ అయింది.
Also Read: Mega Daughter: ‘సింగిల్’ నిహారిక.. వరుస ఫొటోషూట్స్ వెనుక రీజన్ ఇదే!
𝑷𝑹𝑰𝒀𝑨𝑵𝑲𝑨 𝑴𝑶𝑯𝑨𝑵… We are very happy & excited to have you on board for #OG. ❤️@PawanKalyan @PriyankaaMohan @sujeethsign @dop007 @MusicThaman #ASPrakash @DVVMovies #FireStormIsComing#TheyCallHimOG pic.twitter.com/OMED1rGkrF
— DVV Entertainment (@DVVMovies) April 19, 2023
‘సాహో’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ‘ఓజీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో ప్రియాంకా అరుల్ మోహన్ కూడా జాయిన్ అయ్యారు. ఇప్పుడు పవన్, ప్రియాంక మీద కీలక సన్నివేశాలను తీసే పనిలో సుజీత్ బిజీగా ఉన్నారు. ప్రియాంక మోహనన్ శర్వానంద్‌తో కలిసి ‘శ్రీకారం’ సినిమాలో నటించి తన నటనతో, అందంతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తమిళంలో ‘ఈటీ’, ‘డాన్’ వంటి హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రంలో నటిస్తుంది