టైటిల్ చూసి అదేంటి అనుకుంటున్నారా..? OG మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కానేలేదు అప్పుడే సెన్సార్ ఏంటి అని షాక్ అవుతున్నారా..? మీము చెప్పేది సినిమా సెన్సార్ కాదు…టీజర్ సెన్సార్. అతి త్వరలో OG నుండి మరో టీజర్ రాబోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సాహో ఫేమ్ సుజిత్ (Sujeeth) కలయికలో OG అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. RRR నిర్మాత DVV దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం పై అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి. గతంలో ఈ మూవీ నుండి విడుదలైన టీజర్ సినిమా అంచనాలను అమాంతం పెంచేసింది.
Tirupati Stampede Incident : తిరుపతి తొక్కిసలాట ఘటన పై సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి
ఈ ఒక్క టీజర్ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పింది. అప్పటి నుండి పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లిన , మెగా హీరోలు ఎక్కడికి వెళ్లిన OG అప్డేట్ అడుగుతున్నారు. ఈ క్రమంలో మేకర్స్ మరో టీజర్ ను సిద్ధం చేసారు. 99 సెకండ్ల నిడివితో కూడిన టీజర్ కు సెన్సార్ పూర్తయినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. సంక్రాంతి కానుకగా ఈ టీజర్ విడుదలై ఛాన్స్ ఉందంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో పవన్ కల్యాణ్ ఓజాస్ గంభీర అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన్ని ఢీకొట్టే ప్రతినాయకుడిగా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ నటిస్తున్నారు. ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా, శ్రియా రెడ్డి కీలక పాత్ర పోషిస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య దీనిని నిర్మిస్తున్నారు. 2025 ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.