Site icon HashtagU Telugu

OG Pre Release Business : పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ‘OG’ హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్

Og Trailer

Og Trailer

ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా OG సునామీ కొనసాగుతుంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని యావత్ సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ పవన్ కెరీర్‌లోనే కాకుండా టాలీవుడ్‌లోనూ భారీ రికార్డులు నమోదు చేసింది. పవన్ కళ్యాణ్ (Pawan kalyan)అభిమానుల కోసం ఆయనను ఇష్టపడే దర్శకుడు సుజీత్ స్వయంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం వల్ల ముందే అంచనాలు అమాంతం పెరిగాయి. మాఫియా, గ్యాంగ్‌స్టర్ నేపథ్యంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో చర్చనీయాంశమవుతోంది. దీంతో ట్రేడ్ వర్గాలే కాక, పరిశ్రమ మొత్తానికి ఈ బిజినెస్ ఫిగర్స్ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

Cycling vs Walking: వాకింగ్ vs సైక్లింగ్ – ఆరోగ్యానికి ఏది బెస్ట్? నిపుణుల అభిప్రాయం

పవన్ గత చిత్రం ‘హరిహర వీరమల్లు’ తో పోలిస్తే ‘ఓజీ’ కు బిజినెస్ పరంగా విపరీతమైన గ్యాప్ ఉంది. ‘వీరమల్లు’ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.126 కోట్లకు మాత్రమే పరిమితం కాగా, ‘ఓజీ’ మాత్రం రూ.172 కోట్ల రికార్డు సృష్టించింది. ముఖ్యంగా నైజాంలో ‘వీరమల్లు’ రైట్స్ రూ.37 కోట్లకు అమ్ముడవగా, అదే ప్రాంతంలో ‘ఓజీ’ హక్కులు రూ.54 కోట్లకు వెళ్లాయి. రాయలసీమలో రూ.22 కోట్లు (ఓజీ) – రూ.16.50 కోట్లు (వీరమల్లు), ఉత్తరాంధ్రలో రూ.20 కోట్లు (ఓజీ) – రూ.12 కోట్లు (వీరమల్లు)గా తేడా స్పష్టంగా కనిపిస్తోంది. తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో కూడా ‘ఓజీ’ రైట్స్ అధిక ధరలకు విక్రయమయ్యాయి. ఓవర్సీస్ మార్కెట్లో ‘ఓజీ’ రూ.17.50 కోట్లు రాబట్టగా, ‘వీరమల్లు’ మాత్రం రూ.10 కోట్లకే పరిమితమైంది.

పవన్ కళ్యాణ్ గత ఐదు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో పోలిస్తే కూడా ‘ఓజీ’ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. 25వ సినిమా ‘అజ్ఞాతవాసి’ అప్పట్లో రూ.123.60 కోట్ల బిజినెస్ చేస్తే, తర్వాత ‘కాటమరాయుడు’ రూ.84.50 కోట్లు, ‘వకీల్ సాబ్’ రూ.89.35 కోట్లు, ‘భీమ్లా నాయక్’ రూ.106.75 కోట్లు, ‘బ్రో’ రూ.97.50 కోట్లు మాత్రమే ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాయి. ఇప్పుడు పవన్ కెరీర్‌లోనే అతి పెద్ద ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించిన ‘ఓజీ’ తో బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్లు కూడా రావడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పవన్ క్రేజ్, సుజీత్ దర్శకత్వం, పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ట్రీట్మెంట్ కలిపి ఈ చిత్రాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

Exit mobile version