Site icon HashtagU Telugu

OG Fire Storm Song : ఫైర్ స్ట్రోమ్ రికార్డ్స్..అది పవర్ స్టార్ అంటే !!

Og Song Records

Og Song Records

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను ఉర్రూతలూగిస్తూ ‘ఓజీ’ (OG) చిత్రం నుంచి విడుదలైన “ఫైర్ స్ట్రోమ్” సాంగ్ (Fire Storm Song) రికార్డులను సృష్టిస్తోంది. హై ఎనర్జీతో కూడిన ఈ ట్యూన్ పవన్ కళ్యాణ్ అభిమానులనే కాకుండా సంగీత ప్రియులందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాట విడుదలైన కొద్ది కాలంలోనే స్పాటిఫైలో 1 మిలియన్ స్ట్రీమ్స్ సాధించి రికార్డు సృష్టించింది. సోషల్ మీడియాలో కూడా ఈ పాట ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్ వీడియోలలో ఈ పాట రెండో స్థానంలో నిలవడం పవన్ కళ్యాణ్ క్రేజ్ ను తెలియజేస్తోంది.

“అలలిక కదలక భయపడేలే… క్షణక్షణమొక తల తెగిపడేలే…” వంటి ఎలివేషన్ లిరిక్స్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పూర్తి మాస్ లుక్‌కు తగ్గట్టుగా తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) మరియు ట్యూన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు తెలుగు లిరిక్స్ విశ్వ, శ్రీనివాస్ రాయగా, ఇంగ్లీష్ లిరిక్స్ రాజకుమారి రాశారు. ఆమెనే ఫీమేల్ వాయిస్ అందించారు. కోలీవుడ్ స్టార్ శింబుతో పాటు తమన్, నజీరుద్దీన్, దీపక్ బ్లూ, భరద్వాజ్ ఈ పాటను ఆలపించారు. ఈ పాటలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ, దానికి తగ్గట్టుగా ‘ఓజెస్ గంభీర’ అనే లిరిక్స్, బీజీఎం ఫ్యాన్స్‌కు పండుగ వాతావరణం తీసుకొచ్చాయి.

Emergency Numbers: హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం.. అత్య‌వ‌స‌ర నంబ‌ర్లు ప్ర‌క‌టించిన అధికారులు!

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక సమురాయ్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని మాఫియా, గ్యాంగ్‌స్టర్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా కొన్ని గన్స్ కూడా డిజైన్ చేయించారని ప్రచారం జరుగుతోంది. ‘సాహో’ ఫేం సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనున్నారు. ప్రకాశ్ రాజ్, శ్రియ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాస్ పవర్ ఫుల్ వారియర్ లుక్ ఈ సినిమాతో నెరవేరనుందని సమాచారం.