OG Director Sujith రన్ రాజా రన్ సాహో సినిమాలతో డైరెక్టర్ గా సత్తా చాటిన సుజిత్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజి సినిమా చేస్తున్నాడని తెలిసిందే. డివివి దానయ్య బ్యానర్లో భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సెప్టెంబర్ 27న రిలీజ్ ప్లాన్ చేశారు. పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్న ఈ మూవీ నుండి వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై సూపర్ పచ్చి పెంచింది. డైరెక్టర్ గా సినిమా చేస్తున్న ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నాడు సుజిత్. దానికి కారణం పవన్ కళ్యాణ్ కి సుజిత్ వీరాభిమాని అవటమే.
ఇక లేటెస్ట్ గా తన అభిమానాన్ని మరోసారి చూపించాడు సుజిత్. పవన్ కళ్యాణ్ తన భుజం మీద చేయి వేసిన ఫోటోని ఇంస్టాగ్రామ్ డీపీ గా పెట్టుకున్నాడు డైరెక్టర్ సుజిత్. ప్రస్తుతం ఈ ఫోటో పవర్ స్టార్ ఫ్యాన్స్ ని అలరిస్తుంది. అంతేకాదు సోషల్ మీడియా మొత్తం వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఓజి ఒక డిఫరెంట్ మూవీ గా ప్లాన్ చేశారు. సాహో తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న సుజిత్ ఈ మూవీతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు.
పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఓజి సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమాగా ఓజి సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. మరి ఈ సినిమా ప్రభావం ఏ రేంజ్ లో ఉంటుంది అన్నది చూడాలి. పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం సుజిత్ మీద భారీ హోప్స్ పెట్టుకున్నారు. ప్రచార చిత్రాలు రిలీజ్ అవుతున్న ఫోటోలు కూడా సినిమాపై మరింత క్రేజ్ తెస్తున్నాయి.