పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మళ్లీ సినిమా షూటింగ్ లతో బిజీ అయ్యారు. ఓ పక్క రాజకీయాలు చూసుకుంటూనే మరోపక్క గతంలో ఒప్పుకున్నా సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. మంగళగిరి లో వేసిన ప్రత్యేక సెట్ లో హరిహర వీరమల్లు సినిమా (Hari Hara Veera Mallu ) షూటింగ్ లో పాల్గొన్నారు. అలాగే మిగతా సినిమాలను సైతం పూర్తి చేయాలనీ చూస్తున్నాడు. ఈ మూవీ తో సుజిత్ డైరెక్షన్లో ‘OG’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ‘OG’ నుంచి కొత్త పోస్టర్ (OG Cover Page) విడుదలైంది. ఫ్యాన్స్ కోసం మేకర్స్ తాజాగా కవర్ పిక్ ను రిలీజ్ చేశారు. ‘ఈ వీధులు మళ్లీ ఎప్పుడూ ఇలా ఉండవు’ అంటూ పోస్టర్ కు క్యాప్షన్ ఇచ్చారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. ఆర్ఆర్ఆర్ ఫేమ్ నిర్మాత దానయ్య డీవీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఈ మూవీలో ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మి తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ మధ్య విడుదలైన టీజర్ కు ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో తెలియంది కాదు..ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను సుజిత్ (Sujeeth) డైరెక్ట్ చేస్తున్నాడు. OG” అనేది ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఉండబోతుందని సమాచారం. అయితే, కథ గురించి ఇంకా స్పష్టమైన వివరాలు అధికారికంగా వెల్లడించబడలేదు. తమన్ ఎస్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
Read Also : MVV Satyanarayana : వైసీపీ మాజీ ఎంపీ , సినీ నిర్మాత ఇళ్లల్లో ఈడీ సోదాలు