Site icon HashtagU Telugu

OG 1st Song : OG ఫస్ట్ సాంగ్ లిరికల్ రిలీజ్..గుస్ బంప్స్ తెప్పించిన థమన్

Og Song

Og Song

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు శుభవార్త! హరి హర వీరమల్లు చిత్రం నిరాశపరిచిన నేపథ్యంలో, OG సినిమాలోని మొదటి పాట ‘ఫైర్‌స్టార్మ్’ (Firestorm ) వారికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాలో ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. దసరాకు విడుదల చేయడానికి ప్రణాళికలు జరుగుతున్న ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ తాజాగా మొదలయ్యాయి.

Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీ.. సునీల్ గవాస్కర్‌ రికార్డు సమం!

శనివారం సోషల్ మీడియా వేదికగా విడుదలైన ‘ఫైర్‌స్టార్మ్’ లిరికల్ వీడియోను ఎస్. థమన్ స్వరపరిచారు. ఈ పాట పవన్ కళ్యాణ్ పోషిస్తున్న ఓజాస్ గంభీర పాత్రను ఎలివేట్ చేసేలా రూపొందించబడింది. ఈ పాటలో తెలుగు, ఇంగ్లీష్, జపనీస్ భాషల మిశ్రమ గీతాలు వినిపించడం విశేషం. ప్రముఖ నటుడు శింబు ఈ పాటను ఆలపించడంతో అభిమానుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ పాట పవన్ కళ్యాణ్ అభిమానులకు నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తోంది.మీరు కూడా ఈ సాంగ్ పై లుక్ వెయ్యండి.