Actress Ruchismita Guru: ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ నటి.. కారణమిదే..?

ప్రముఖ ఒడియా నటి, గాయని రుచిస్మిత గురు (Actress Ruchismita Guru) ఒడిశాలోని తన మామ ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు తన కూతురు రాత్రి భోజనం చేసే విషయంలో తనతో గొడవపడిందని ఆమె తల్లి పోలీసులకు తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
Actress Ruchismita Guru

Resizeimagesize (1280 X 720)

ప్రముఖ ఒడియా నటి, గాయని రుచిస్మిత గురు (Actress Ruchismita Guru) ఒడిశాలోని తన మామ ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు తన కూతురు రాత్రి భోజనం చేసే విషయంలో తనతో గొడవపడిందని ఆమె తల్లి పోలీసులకు తెలిపారు. గతంలో కూడా ఆమె ఆత్మాహత్యాయత్నం చేసిందని వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఆదివారం రాత్రి బలంగీర్ జిల్లా సుదాపాడ వద్ద ఓ ఇంట్లో యువ నటి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతి చెందిన నటి రుచిస్మిత గురు, బలంగీర్ పట్టణంలోని తల్పలిపాడుకు చెందిన నటిగా గుర్తించారు. ఆమె సూదాపాడులోని తన మేనమామ ఇంట్లో ఉంటోంది. ఆమె అనేక ఆల్బమ్‌లలో కనిపించింది. ఆమె అనేక స్టేజ్ షోలలో ప్రదర్శించిన గాయనిగా కూడా పేరు పొందింది. ఆదివారం రాత్రి రుచిస్మిత గురు తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న బలంగీర్ పోలీస్ స్టేషన్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం భీమా భోయ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.

Also Read: Samantha: మళ్లీ ప్రేమలో పడొచ్చు కదా అంటూ సమంతకు సలహా.. అదిరిపోయే సమాధానం ఇచ్చిన బ్యూటీ?

కాగా, ఆలు పరాటా తయారీ విషయంలో గొడవ పడ్డారని మృతురాలి తల్లి తెలిపింది. రాత్రి 8 గంటలకు ఆలూ పరాటా వండమని నేను చెప్పానని, అయితే రాత్రి 10 గంటలకు చేస్తానని చెప్పింది. ఈ విషయమై మా మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతకు ముందు కూడా పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని ఆమె తల్లి పేర్కొంది. అయితే ఇది ఆత్మహత్యా లేక మరేదైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. కేసు ఛేదించేందుకు పోస్టుమార్టం నివేదిక ఉపయోగపడుతుందని పోలీసులు భావిస్తున్నారు.

  Last Updated: 28 Mar 2023, 07:09 AM IST