Odela 2 Tamannah First Look : ఓదెల 2.. ఫస్ట్ లుక్ తో షాక్ ఇచ్చిన తమన్నా..!

Odela 2 Tamannah First Look డైరెక్టర్ గానే కాదు నిర్మాతలా తన టేస్ట్ చూపిస్తున్న సంపత్ నంది తన నెక్స్ట్ సినిమా ఓదెల 2 ఫస్ట్ లుక్ తో అందరినీ సర్ ప్రైజ్ చేశాడు. సంపత్ నంది నిర్మాతగా అశోక్ తేజ డైరెక్షన్

  • Written By:
  • Publish Date - March 8, 2024 / 05:30 PM IST

Odela 2 Tamannah First Look డైరెక్టర్ గానే కాదు నిర్మాతలా తన టేస్ట్ చూపిస్తున్న సంపత్ నంది తన నెక్స్ట్ సినిమా ఓదెల 2 ఫస్ట్ లుక్ తో అందరినీ సర్ ప్రైజ్ చేశాడు. సంపత్ నంది నిర్మాతగా అశోక్ తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఓదెల రైల్వేస్టేషన్. ఆహా ఓటీటీలో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అందుకే ఓదెల 2 అంటూ ఈ సినిమా సీక్వెల్ ప్లాన్ చేశారు. అంతేకాదు ఓదెల రైల్వేస్టేషన్ సినిమా ఓటీటీ రిలీజ్ అవగా ఓదెల 2 అంటూ థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

ఓదెల 2 సినిమాలో తమన్నా లీడ్ హీరోయిన్ గా నటిస్తుంది. సంపత్ నంది డైరెక్షన్ లో తమన్నా చాలా సినిమాల్లో నటించింది. ఇప్పుడు అతని నిర్మాణంలో కూడా తమన్నా నటిస్తుంది. ఈ సూపర్ హిట్ కాంబినేషన్ ఓదెల 2 పై మరింత బజ్ పెంచేలా చేసింది. ఓదెల 2 సినిమా థ్రిల్లర్ జోనర్ లో పార్ట్ 1 కన్నా భారీగా రాబోతుంది. ఈమధ్యనే చిత్ర యూనిట్ వారణాసిలో మొదటి షెడ్యూల్ మొదలు పెటారు.

ఈరోజు శివరాత్రి సందర్భంగా ఓదెల 2 నుంచి తమన్నా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. సినిమాలో తమన్నా శివ శక్తి అనే పాత్రలో నటిస్తుంది. ఆమె నాగ సాధువు వేశంలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఫస్ట్ లుక్ తోనే సినిమాపై రేంజ్ పెంచారు మేకర్స్. ఓదెల 2 సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తమన్నా కెరీర్ లో డిఫరెంట్ రోల్ గా శివ శక్తి పాత్ర ఉండనుందని తెలుస్తుంది.