నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రీసెంట్ గా వచ్చిన సినిమా ‘బింబిసార’ (Bimbisara) చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. బింబిసారుడుగా కళ్యాణ్ రామ్ ఇరగదీశాడు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 5 తేదీన రిలీజై.. బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సుమారు రూ.75కోట్లు రాబట్టింది. చాలా కాలంగా హిట్స్ లేని కళ్యాణ్ రామ్ కి ఈ చిత్రం మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని మూవీ లవర్స్ అందరూ ఎదురుచూస్తున్నారు.
బింబిసార మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర ఓటీటీ రిలీజ్ డేట్ గురించి అప్ డేట్ వచ్చింది. అయితే దీపావళి కానుకగా అక్టోబరు 21 నుంచి ఈ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. బింబిసార చిత్రంలో కేథరిన్, సంయుక్త మీనన్‌లు కథానాయికలుగా నటించారు. ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కీలకపాత్రల్లో మెరిశారు. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణీ సంగీతం అందించారు. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులే కాకుండా, సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.