Site icon HashtagU Telugu

Manchu Vishnu : ‘క‌న్న‌ప్ప‌’ కు ఫస్ట్ షాక్..

Nupur Sanon Kannappa

Nupur Sanon Kannappa

మంచు విష్ణు (Vishnu Manchu)కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం విష్ణు ‘క‌న్న‌ప్ప‌’ (Kannappa ) అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఈ సినిమా ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. . 24 ఫ్రేమ్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ఏవీఏ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌ల‌పై అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు.

ఈ సినిమాలో దేశ వ్యాప్తంగా పాపుల‌ర్ అయిన న‌టీన‌టులను ఎంపిక చేసారు. బాలీవుడ్ హీరోయిన్ నుపూర్ స‌న‌న్ (Nupur Sanon) హీరోయిన్‌గా ఫిక్స్ చేసారు. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఇంత‌లోనే ఈ ప్రాజెక్ట్‌కు భారీ షాక్ త‌గిలింది. ఈ సినిమాలో న‌టిస్తున్న హీరోయిన్ నుపూర్ స‌న‌న్ సినిమా ప్రారంభానికి ముందే ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుని షాక్ ఇచ్చింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా హీరో మంచు విష్ణు వెల్ల‌డించారు. కాల్షీట్లు సర్దుబాటు చేసుకోలేకపోవడం వల్ల నుపుర్ సనన్ తన సినిమా నుంచి తప్పుకున్నట్టు మంచు విష్ణు పేర్కొన్నారు.

‘షెడ్యూల్స్ సర్దుబాటు ఇబ్బందులతో కన్నప్ప సినిమా నుంచి లవ్‌లీ నుపుర్ సనన్ తప్పుకుంటున్నట్టు ప్రకటించడానికి బాధగా ఉంది. ఆమెను మేం మిస్ అవుతాం. కానీ, మా కొత్త హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టాం! నుపుర్ చేస్తున్న ఇతర సినిమాలు మంచి విజయాలను అందుకోవాలని నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఆమెతో కలిసి పనిచేస్తానని ఆశిస్తున్నాను. మున్ముందు ఆసక్తి విషయాలు వెల్లడిస్తాం. అప్‌డేట్స్ కోసం వేచి చూస్తూ ఉండండి’ అని ట్వీట్‌లో మంచు విష్ణు పేర్కొన్నారు.

ఇక మంచు విష్ణు పెట్టిన ఈ ట్వీట్ కు నెటిజన్ల నుండి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. నుపుర్ సనన్ సినిమా నుండి తప్పుకొని, మంచి నిర్ణయం తీసుకుందని కామెంట్లు పెడుతున్నారు. సాధారణంగా మంచు ఫ్యామిలీ నుంచి ఏ ట్వీట్ వచ్చిన దానికి నెగిటివ్ ట్వీట్స్ , ట్రోలింగ్ లు రావడం కామన్ గా మారింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది.

Read Also : Chennai Cab Driver : చెన్నై క్యాబ్ డ్రైవర్ బ్యాంక్ అకౌంట్‌లో రూ.9000 కోట్ల డిపాజిట్‌.. కాని కాసేప‌టికే..!

మంచు విష్ణు కెరియర్ విషయానికి వస్తే..కొంత కాలంగా స‌రైన స‌క్సెస్ కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. కొంతకాలంగా ఆయన ఏ సినిమా చేసిన బాక్సాఫీస్ వ‌ద్ద భారీ పరాజయాన్ని మూటకట్టుకుంటుంది. ఇప్పటివరకు `ఢీ` తప్ప మరో ఆ స్థాయి హిట్ కొట్టలేదు విష్ణు. అందుకే ఆయన త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ `క‌న్న‌ప్ప‌` ప్రాజెక్ట్‌ని మొద‌లు పెట్టారు. ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లేలోపే షాక్ తగిలింది. ముందు ముందు ఇంకెన్ని షాకులు తగులుతాయి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.