రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోలు. ఈ ఇద్దరు ఆర్ఆర్ఆర్ సినిమాతో అదరగొట్టారు. వాళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. అయితే వీరిద్దరి మధ్య ఇటీవల గ్యాప్ ఉందంటూ వార్తలు వినిపిస్తున్నా.. ఈ స్టార్స్ మాత్రం కలిసి ఉన్నట్టుగానే సంకేతాలు ఇస్తున్నారు. రామ్ చరణ్ ఇటీవలి తండ్రిగా మారడం అతని కుటుంబానికి ఎనలేని ఆనందాన్ని కలిగించింది. ఇప్పుడు చరణ్ కూతురికి ఎన్టీఆర్ స్పెషల్ గిఫ్ట్ పంపినట్లు సమాచారం.
ఇద్దరు నటీనటుల స్నేహబంధం కేవలం సినిమా సెట్స్‌కే పరిమితం కాలేదు. వ్యక్తిగత క్షణాలను కూడా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు క్లీంకర జన్మించిన సమయంలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్, అతని పిల్లలు అభయ్ మరియు భార్గవ్ రామ్ చరణ్, ఉపాసన గారాల బిడ్డ క్లీంకర కు గోల్డ్ కాయిన్‌లను అందంగా డిజైన్ చేసి ప్రత్యేక బహుమతిని పంపారు.
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహాన్ని అభిమానులు మెచ్చుకుంటున్నారు. వారు అభినందిస్తున్నారు. వారి బలమైన బంధం వారి అభిమానులను ప్రేరేపించడమే కాకుండా నిజమైన స్నేహానికి ఉదాహరణగా నిలుస్తుంది. RRR మూవీతో తారక్, చరణ్ మధ్య బంధం పెరిగింది.
Also Read: BC Bandhu: బీఆర్ఎస్ లో వర్గపోరు.. నిలిచిపోయిన బీసీ బంధు!