Site icon HashtagU Telugu

NTR : దేవర హిట్ అయినందుకు.. పెద్ద లెటర్ రాసి అందరికి థ్యాంక్స్ చెప్పుకొచ్చిన ఎన్టీఆర్..

NTR Wrote Special Letter on Devara Movie Success

Ntr Devara

NTR : ఎన్టీఆర్ ఇటీవల దేవర(Devara) సినిమాతో వచ్చి విజయం సాధించిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా అభిమానులను మెప్పించింది. సినిమా టాక్ తో సంబంధం లేకుండా హాలిడేస్ కూడా ఉండటంతో కలెక్షన్స్ బాగానే వచ్చాయి. దేవర సినిమా ఆల్మోస్ట్ 500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.

దీంతో దేవర పార్ట్ 2 పై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే దేవర హిట్ అయినందుకు ఎన్టీఆర్, మూవీ యూనిట్ స్పెషల్ పార్టీ చేసుకున్నారు. తాజాగా ఎన్టీఆర్ ఈ సినిమా పై అందరికి థ్యాంక్స్ చెప్తూ స్పెషల్ లెటర్ రిలీజ్ చేసారు.

ఎన్టీఆర్ తన లెటర్ లో.. దేవర పార్ట్ 1కి అందుతున్న అద్భుతమైన స్పందనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. నా సహ నటులైన సైఫ్ అలీ ఖాన్ సర్, జాన్వీ, ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు మరియు ఇతర నటీనటులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు తమ పాత్రలకు ప్రాణం పోసి, మా కథకు జీవం ఇచ్చారు. నా దర్శకుడు కొరటాల శివ గారికి ధన్యవాదాలు. ఈ కథను సృష్టించిన ఆయన దిశానిర్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ విజయవంతమైంది. అనిరుధ్ అద్భుతమైన సంగీతం, రత్నవేలు సర్ సినిమాటోగ్రఫి, సాబు సర్ ప్రొడక్షన్ డిజైన్, యుగంధర్ గారు వీఎఫ్ఎక్స్, శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటింగ్ తో ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచినందుకు ధన్యవాదాలు. మా సినిమాను విజయవంతంగా ప్రదర్శించిన పంపిణీదారులు, థియేటర్ ప్రదర్శకులకు ధన్యవాదాలు. నా సినీ పరిశ్రమ మిత్రులకు, వారు అందించిన ప్రేమకు ధన్యవాదాలు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న మీడియాకు మా సినిమాను విశేషంగా ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు. మా నిర్మాతలు సుధాకర్ మిక్కిలినేని గారు మరియు హరికృష్ణ కొసరాజు గారికి ఈ ప్రాజెక్ట్ను విజయవంతంగా రూపొందించినందుకు ధన్యవాదాలు. ప్రపంచ నలుమూలల ఇంతటి ఆదరణ చూపిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు నా ధన్యవాదాలు. నా కుటుంబ సభ్యులైన నా అభిమానులందరికీ, గత నెల రోజులుగా దేవర చిత్రాన్ని ఒక పండుగలా జరుపుకుంటున్నందుకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు చూపించే ప్రేమ అభిమానమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. మీరు ఎలప్పుడు గర్వపడే చిత్రాలు చేస్తూనే ఉండడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. ‘దేవర పార్ట్ 1’ చిత్రాన్ని మీ భుజాలపై మోసి ఇంతటి ఘన విజయవంతంగా మార్చినందుకు కృతజ్ఞతలు అంటూ రాసుకొచ్చారు. దీంతో ఎన్టీఆర్ రాసిన లెటర్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

 

Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కరాటే, మార్షల్ ఆర్ట్స్ ఎక్కడ నేర్చుకున్నారో తెలుసా..? ఆయన గురువు ఎవరో తెలుసా?