NTR : ఎన్.టి.ఆర్ తో ఆ ఇద్దరు.. ఫోటో అదిరిందిగా..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ (NTR) ప్రస్తుతం దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా

Published By: HashtagU Telugu Desk
Ntr With Two Super Talented Directors Photo Viral In Social Media

Ntr With Two Super Talented Directors Photo Viral In Social Media

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ (NTR) ప్రస్తుతం దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. దేవర పార్ట్ 1 సినిమా అక్టోబర్ 10న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

ఇదిలాఉంటే లేటెస్ట్ గా ఎన్.టి.ఆర్ కన్నడ పరిశ్రమలో ఒక ఈవెంట్ జరుగగా అందులో పాల్గొన్నారు. ఈవెంట్ ప్రత్యేకత ఏంటన్నది తెలియదు కానీ ఎన్.టి.ఆర్ తో సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, కాంతార డైరెక్టర్ కం యాక్టర్ రిషబ్ శెట్టి కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది.

సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్.టి.ఆర్ తో సినిమా చేస్తాడని తెలిసిందే. ఇక కాంతార తో సెన్సేషనల్ హిట్ అందుకున్న రిషబ్ శెట్టికి కూడా ఎన్.టి.ఆర్ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఈ ముగ్గురు దిగిన ఫోటో ప్రస్తుతం ఆడియన్స్ ని అలరిస్తుంది.

  Last Updated: 02 Mar 2024, 12:18 PM IST