Site icon HashtagU Telugu

NTR : లండన్ లో ఎన్టీఆర్.. న్యూ ఇయర్ కూడా అక్కడే..!

NTR Video

NTR Video

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి లండన్ వెకేషన్ లో ఉన్నారు. సినిమా సినిమాకు మధ్య గ్యాప్ దొరికితే చాలు ఫ్యామిలీతో జాలీ ట్రిప్ వేస్తుంటారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తం లండన్ షిఫ్ట్ అయ్యింది. లండన్ రోడ్ల మీద ఎన్టీఆర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి సరైన టైం కేటాయించడంలో మన స్టార్స్ ముందుంటారు.

లండన్ లో ఎన్టీఆర్ విత్ ఫ్యామిలీ వెకేషన్ పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ న్యూ ఇయర్ పార్టీ కూడా అక్కడే జరుపుకునేలా ఉన్నారు. ప్రసుతం ఎన్టీఆర్ వార్ 2 సినిమా చేస్తున్నాడు. ఈ ఇయర్ దేవరతో వచ్చి సత్తా చాటిన తారక్ వార్ 2 తో నెక్స్ట్ ఇయర్ ఫ్యాన్స్ ని అలరించనున్నాడు.

ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా కూడా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. వా 2 తో 2025 లో ఫ్యాన్స్ ని సూపర్ ట్రీట్ ఇవ్వనున్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాను 2026 లో తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. లండన్ లో ఎన్టీఆర్ ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తుండగా మహేష్ బాబు కూడా తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లారని తెలుస్తుంది.