Site icon HashtagU Telugu

War 2 : ఆయన విలన్ కాదు.. వీర్ విలన్..! ‘వార్ 2’లో ఎన్టీఆర్ లుక్ పై మరో అప్డేట్..

War 2 New Poster

War 2 New Poster

War 2 : బాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా మారిన ‘వార్ 2’పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. 2019లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘వార్’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే సిరీస్‌కు కొనసాగింపుగా ‘వార్ 2’ తెరకెక్కుతోంది. హృతిక్ మళ్లీ మేజర్ కబీర్ ధాలివాల్‌గా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించబోతుండగా, ఈ సారి ప్రధాన ఆకర్షణగా ఎన్టీఆర్ అతి కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్‌లో పూర్తి స్థాయిలో ప్రవేశం చేస్తున్నాడు. ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆయనది హీరో రోల్ కాదన్నదే! ఈసారి తారక్ హిందీ ఆడియన్స్‌ను తన విలన్ గెటప్‌తో అబ్బురపరచబోతున్నాడు. కానీ, ఇది కేవలం నెగెటివ్ రోల్ కాదు – ఇది ఓ ఇంటెన్స్ యాక్షన్ షేడ్‌తో కూడిన పవర్‌ఫుల్ క్యారెక్టర్ అని సమాచారం. ‘వార్ 2’ కథ మరింత డార్క్, స్టైలిష్, ఎమోషనల్ యాక్షన్‌తో కూడినదిగా ఉండబోతోందని చిత్ర బృందం సంకేతాలు ఇస్తోంది.

ఈ చిత్రం పోస్టర్స్‌, అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు తాజాగా ఒక సర్‌ప్రైజ్ వచ్చింది. మూవీ నుంచి కౌంట్‌డౌన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్ ఓ మాస్ గ్లామరస్ లుక్‌లో దర్శనమిచ్చారు. బ్లాక్ అండ్ గ్రే టోన్ కలర్ ప్యాలెట్‌లో.. ఫేస్‌పై మాస్క్‌, స్టైలిష్ గాగుల్స్ ధరించి కనిపించిన ఎన్టీఆర్ లుక్ నెటిజన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. అతి తక్కువ టైమ్‌లోనే ఈ పోస్టర్ ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది.

Zomato: విమానయాన రంగంలోకి జొమాటో వ్యవస్థాపకుడు..ప్రైవేటు జెట్‌తో ఎంట్రీ

ఇక అభిమానులు తమ ఫేవరిట్ స్టార్‌ను ఈ రేంజ్‌లో చూడటం కొత్త అనుభూతి అంటున్నారు. ‘‘విలన్ అయినా ఓ రేంజ్ ఉంది’’, ‘‘డెడ్‌లీ షేడ్స్‌లో తారక్ ఏ లెవల్‌లో ఉన్నాడో చెప్పలేం’’, ‘‘విలన్ అని చెప్పినా.. లుక్ మాత్రం హీరోలను మించిపోయింది’’ అంటూ కామెంట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

ఈ చిత్రానికి ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా, ‘యష్ రాజ్ ఫిలిమ్స్’ అధినేత ఆదిత్య చోప్రా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఇండియన్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. యాక్షన్, డ్రామా, స్టైల్, ఇంటెన్సిటీ అన్నీ కలిపి ఈ సినిమా ఒక కొత్త రేంజ్‌ను చూపిస్తుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం నుంచి మరిన్ని అప్‌డేట్స్ త్వరలోనే బయటకు రానున్నాయి. హృతిక్ వర్సెస్ ఎన్టీఆర్ కాంబోను థియేటర్లో చూడాలన్న ఉత్సుకత అభిమానుల్లో మరింత పెరుగుతోంది.

Jagan Press Meet : రాబోయేది మన ప్రభుత్వమే – జగన్