విజయ్ దేవరకొండ హీరోగా భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమాను గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ హిట్ టార్గెట్ పెట్టుకుని మరీ ఈ సినిమా చేస్తున్నాడు. VD12గా రాబోతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ లో నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవంటూ రౌడీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎటాక్ చేస్తున్నారు.
ఐతే వారి ఊహలకు అందని అప్డేట్ ఒకటి లీక్ అయ్యింది. అదేంటి అంటే విజయ్ దేవరకొండ సినిమాకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడట. వీడీ 12లో తారక్ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. సినిమాకు ఆయన వాయిస్ ఓవర్ చాలా స్పెషల్ అనిపిస్తుందని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ పోలీస్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో తన బెస్ట్ ఇస్తున్నాడని తెలుస్తుంది.
అంతేకాదు ఈ సినిమాను నిర్మాత రెండు భాగాలుగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నామని చెప్పారు. సో VD 12 సినిమా కచ్చితంగా అంచనాలను మించి ఉండబోతుందని అర్ధమవుతుంది. కచ్చితంగా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అయితే సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. కొన్నాళ్లుగా కెరీర్ లో సరైన హిట్ లేని విజయ్ దేవరకొండ VD12 సినిమాతో భారీ టార్గెట్ పెట్టుకున్నాడు. ఈ సినిమా అసలైతే మార్చి ఎండింగ్ కి రిలీజ్ అన్నారు కానీ ఇంకా లేట్ గా వచ్చేలా ఉంది.