Site icon HashtagU Telugu

War 2 Event : తాత ఆశీస్సులు ఉన్నంత కాలం నన్ను ఆపలేరు – Jr.ఎన్టీఆర్

War 2 Pre Release

War 2 Pre Release

‘వార్ 2’ (War 2)సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో జూనియర్ ఎన్టీఆర్ (NTR) మాట్లాడుతూ.. తనపై తన తాత ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నంతకాలం తనని ఎవ్వరూ ఆపలేరని ఉద్వేగంగా తెలిపారు. తన సినీ ప్రయాణంలో అభిమానులు అందించిన ప్రేమ, మద్దతు గురించి మాట్లాడుతూ, “ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను కడుపులో పెట్టుకుని, నా తప్పులను క్షమిస్తూ, బాధలో నాకు భుజాన్ని అందించారు. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను. ఈ జన్మకు మీ ప్రేమ, వాత్సల్యం పొందాను, ఇది చాలు” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

తొలి అభిమానిని గుర్తు చేసుకున్న ఎన్టీఆర్

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ తన 25 ఏళ్ల సినీ కెరీర్‌ను గుర్తు చేసుకున్నారు. తన మొదటి సినిమా ‘నిన్ను చూడాలని’ షూటింగ్ మొదటి రోజు జరిగిన ఒక సంఘటనను పంచుకున్నారు. ఆ సమయంలో ఒక వ్యక్తి తన వెనుకే తిరుగుతుండటం గమనించి, “మీరెవరు?” అని ప్రశ్నించగా, “నా పేరు ముజీబ్, నేను మీ అభిమానిని బాబు” అని చెప్పడంతో తాను ఆశ్చర్యపోయానని అన్నారు. ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే అభిమానిగా మారడం తనను ఆనందపరిచిందని ఎన్టీఆర్ తెలిపారు.

ఎన్టీఆర్ తన మొదటి అభిమాని గురించి మాట్లాడుతున్న సమయంలో, ఆ ముజీబ్ అనే వ్యక్తి వేదికపైకి వచ్చారు. ఊహించని ఈ సంఘటనతో ఎన్టీఆర్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే అభిమానిగా ఉన్న వ్యక్తిని చూడటం తన అదృష్టమని తెలిపారు. అభిమానుల అంతులేని ప్రేమ, మద్దతు తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని, వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని ఎన్టీఆర్ అన్నారు. ఈ సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డానని, దర్శకుడు మరియు చిత్ర బృందం అంకితభావంతో పనిచేశారని తెలిపారు. అభిమానుల అంచనాలను అందుకునేలా ఈ సినిమా ఉంటుందని, ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి గొప్ప స్పందన లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా కూడా తన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఎన్టీఆర్ పేర్కొన్నారు.

Gold Rate Today: దిగొచ్చిన బంగారం ధరలు..కొనుగోలు దారులకు ఇదే మంచి ఛాన్స్