Site icon HashtagU Telugu

NTR Simhadri : సింహాద్రి రీ రిలీజ్.. ఈసారి ఫ్యాన్స్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్..!

Ntr Simhadri Re Release Planing Next Levelntr Simhadri Re Release Planing Next Level

Ntr Simhadri Re Release Planing Next Levelntr Simhadri Re Release Planing Next Level

NTR Simhadri యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ రాజమౌళి కాంబినేషన్ లో సెన్సేషనల్ హిట్ గా నిలిచిన సినిమా సింహాద్రి 2003 లో వచ్చిన ఈ సినిమా ఎన్.టి.ఆర్ కు బీభత్సమైన మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా 21 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. స్టార్ సినిమాల రీ రిలీజ్ టైం నడుస్తున్న ఈ టైం లో ఇప్పటికే చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు సింహాద్రి వంతు వచ్చింది.

అయితే ఎన్.టి.ఆర్ సినిమాల రీ రిలీజ్ విషయంలో ఫ్యాన్స్ పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ సింహాద్రి కి రికార్డ్ కలెక్షన్స్ రాబట్టేలా ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారట. కచ్చితంగా ఈ సినిమా ఫ్యాన్స్ అందరు చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారట. మార్చి 1న సింహాద్రి రీ రిలీజ్ జరుగుతుంది. ఎన్.టి.ఆర్ మాస్ స్టామినా ప్రూవ్ చేసిన సింహాద్రి రీ రిలీజ్ టైం లో కూడా భారీ వసూళ్లను రాబట్టాలని చూస్తుంది.

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సింహాద్రి సినిమాలో భూమిక, అంకిత హీరోయిన్స్ గా నటించారు. కీరవాణి అందిచిన మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. సింహాద్రి రీ రిలీజ్ ఫ్యాన్స్ అందరికీ ఫెస్టివల్ టైం అని చెప్పొచ్చు. మరి ఇప్పటివరకు రీ రిలీజ్ టైం లో ఉన్న రికార్డులను సింహాద్రి బ్రేక్ చేస్తుందా లేదా అన్నది చూడాలి.