Site icon HashtagU Telugu

Ankitha : ఎన్టీఆర్‌తో నటించిన ఈ భామ.. ఇప్పుడు ఏం చేస్తుందో..? ఎక్కడ ఉందో తెలుసా..?

NTR Simhadri Heroine Ankitha details present status

NTR Simhadri Heroine Ankitha details present status

ముంబై భామ అంకిత(Ankitha).. తెలుగు సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. 2002లో వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాలో హీరోయిన్ గా నటించి వెండితెర అరంగేట్రం చేసింది. ఆ తరువాత మరో మూడు చిన్న సినిమాల్లో నటించిన ఈ భామ.. నాలుగో సినిమాని జూనియర్ ఎన్టీఆర్ (NTR) తో నటించే అవకాశం అందుకుంది. 2003లో దర్శకధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘సింహాద్రి'(Simhadri). ఈ మూవీ అప్పటిలో ఎంతటి బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే.

ఈ మూవీలో హీరోయిన్స్ గా అంకిత, భూమిక నటించారు. సినిమాలో ఎన్టీఆర్ అండ్ అంకిత మధ్య వచ్చే సన్నివేశాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఈ మూవీలోని ‘చీమ చీమ చీమ చీమ’ సాంగ్ కి ఎన్టీఆర్ తో కలిసి ఈ భామ వేసిన స్టెప్పులు అందర్నీ ఉర్రూతలూగించాయి. అయితే ఆ సినిమా అంత పెద్ద విజయం సాదించనప్పటికీ అంకితకు మాత్రం పెద్దగా ఆఫర్లు చేరి రాలేదు. 2004లో బాలకృష్ణ (Balakrishna) సరసన ‘విజయేంద్రవర్మ’ సినిమాలో కాసేపు కనిపించి అలరించింది.

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 2002 నుంచి 2009 వరకు సినిమాలు చేస్తూ వచ్చింది ఈ భామ. ఆ తరువాత అవకాశాలు లేకపోవడంతో 2016లో ‘విశాల్ జగతాప్’ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని సినిమాలకు పూర్తిగా గూడ బై చెప్పేసి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం అమెరికాలోని న్యూ జెర్సీలో ఉంటుంది. ఈమెకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు. అమెరికాలోని సిటీ బ్యాంక్‌ లో అంకిత భర్త పని చేస్తున్నారు. ఇక న్యూ జెర్సీలో వీరి ఇల్లు దాదాపు అర ఎకరం స్థలంలో ఉంటుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

Also Read : Nani30 Title: నాని కొత్త సినిమా టైటిల్ ఇదే.. మరోసారి ఫ్యామిలీ ఎమోషన్స్ తో!