NTR Family : ఎన్టీఆర్ ఇటీవలే దేవర సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టి 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసాడు. RRR తర్వాత చాలా గ్యాప్ తో వచ్చి పెద్ద హిట్ కొట్టడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక దేవరకు పార్ట్ 2 కూడా ఉన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా నిన్న దీపావళి సందర్భంగా ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి దిగిన స్పెషల్ ఫోటో తన సోషల్ మీడియాలో షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపాడు. ఎన్టీఆర్, అతని భార్య ప్రణతి, పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఈ ఫొటోలో చక్కగా సాంప్రదాయ దుస్తులు వేసుకొని ఉన్నారు.
దీంతో ఎన్టీఆర్ షేర్ చేసిన ఫ్యామిలీ ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ ని చూసి అప్పుడే అభయ్ ఇంత పెద్దోడు అయిపోయాడా అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక అభిమానులు, నెటిజన్లు ఎన్టీఆర్ కు ఈ ఫోటో కింద కామెంట్స్ లో దీపావళి విషెస్ చెప్తున్నారు.
Also Read : Thandel : పెళ్లి అయిన తర్వాతే ఆ సినిమా రిలీజ్.. నాగచైతన్య – శోభిత పెళ్లి ఎప్పుడు?