Site icon HashtagU Telugu

Devara : ఎన్టీఆర్ స్క్రీన్ నేమ్ మారింది చూశారా.. ఇక నుంచి అదే రచ్చ..!

Is NTR Devara Release Planing to Postpone

Is NTR Devara Release Planing to Postpone

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర (Devara) నుంచి ఫస్ట్ గ్లింప్స్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కే ఈ సినిమా అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంది. ముఖ్యంగా సముద్ర తీరాన తారక్ ఉగ్ర నరసింహావతారం లో ఊచకోత కోస్తుంటే చూసేందుకు రెండు కళ్లు చాలవు అన్నట్టుగా అభిమానుల ఉత్సాహం ఉంది. జస్ట్ గ్లింప్స్ తోనే ఈ రేంజ్ వైబ్రేషన్స్ తెచ్చిన కొరటాల శివ కచ్చితంగా సినిమాను నెక్స్ట్ లెవెల్ లో తెరకెక్కించి ఉంటాడని అంటున్నారు.

We’re now on WhatsApp : Click to Join

ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ లో ఎన్.టి.ఆర్ (NTR) స్క్రీన్ నేం కూడా మార్చి వేశారు. మొన్నటిదాకా ఎన్.టి.ఆర్ స్క్రీన్ నేమ్ గా యంగ్ టైగర్ అని ఉండేది. కానీ దేవర సినిమాకు మాన్ ఆఫ్ మాసెస్ (Man of Masses) అని స్క్రీన్ నేమ్ వేశారు. ఈమధ్య ఎన్.టి.ఆర్ ని మాన్ ఆఫ్ మాసెస్ అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుస్తున్నారు. ఆ పేరునే తారక్ స్క్రీన్ నేమ్ గా పెట్టేశారు. ఓ విధంగా దేవర గ్లింప్స్ తో పాటు స్క్రీన్ నేమ్ చేంజ్ కూడా ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందించిందని చెప్పొచ్చు.

దేవర సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాను మొదట ఒక పార్ట్ గానే తీయాలని అనుకున్నా కథ బాగా కుదరడం క్యారెక్టరైజేషన్స్ బలంగా వస్తుండటం వల్ల సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. దేవర మొదటి పార్ట్ ఏప్రిల్ 5న రిలీజ్ లాక్ చేశారు. సినిమా పై అంచనాలను ఏమాత్రం తగ్గకుండా గ్లింప్స్ తో రచ్చ షురూ చేశాడు కొరటాల శివ.

మాన్ ఆఫ్ మాసెస్ అనే స్క్రీన్ నేమ్ కూడా పడింది కాబట్టి దేవర సినిమా మరి కాస్త స్పెషల్ గా మారింది. అంతేకాదు ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ నట విశ్వరూపం ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అందిస్తుందని అంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత తారక్ నుంచి వస్తున్న ఈ సినిమా విషయంలో మేకర్స్ అంతా కూడా చాలా జాగ్రత్త వహిస్తున్నారు.

Also Read : Guntur Kaaram Pre Release : ఇక మీరే నా అమ్మ..నాన్న – మహేష్ బాబు

సినిమాతో మరోసారి ఇంటర్నేషనల్ లెవెల్ లో తన ఫ్యాన్స్ కి ట్రీట్ అందించాలని ఫిక్స్ అయ్యాడు ఎన్.టి.ఆర్. ఈ సినిమా తో పాటుగా ఎన్.టి.ఆర్ వార్ 2 లో కూడా నటిస్తున్నాడు. హృతిక్ రోషన్ తో కలిసి తారక్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ సినిమాపై కూడా భారీ హైప్ ఏర్పడుతుంది.