ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం కామన్ గా జరుగుతుంది. ఒకసారి కాదనుకున్న చిత్రాలు సూపర్ హిట్లు అవుతాయి లేదా డిజాస్టర్లుగా కూడా మిగులుతాయి. అయితే ఎన్టీఆర్, దర్శకుడు శ్రీవాసు విషయంలో జరిగింది మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎన్టీఆర్(NTR) వద్దు అన్న కథ పక్క హీరో దగ్గరకి అసలు వెళ్ళలేదు. ఎన్టీఆర్ ఒకే చేయాల్సిన కథ వేరు, పక్క హీరో హిట్ కొట్టిన కథ వేరు. కానీ కథలో చాలా దగ్గరి సంబంధం ఉందట.
అసలు విషయం ఏంటంటే.. 2007 లో దర్శకుడు శ్రీవాసు(Sriwass) గోపీచంద్(Gopichand) తో ‘లక్ష్యం’ సినిమా తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు. దీంతో దిల్ రాజు(Dil Raju) శ్రీవాసుని పిలిచి మరి ఆఫర్ ఇచ్చాడట. ఒక స్టార్ హీరోతో సినిమా చేయాలనీ భావించి ఎన్టీఆర్ కి ఒక స్టోరీ ఐడియాని చెప్పాడట. అది విన్న ఎన్టీఆర్ చాలా కొత్తగా, ఇటీవల ఇలాంటి నేపథ్యం ఉన్న సినిమా ఏది రాలేదు అని చెప్పాడట. ఇక ఎన్టీఆర్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో శ్రీవాసు ఆ కథ పై కూర్చొని స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసి ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళాడు.
అయితే ఈ గ్యాప్ లో ఏమైందో గాని ఎన్టీఆర్ కి ఆ కథ సెట్ అవ్వదని భావించాడట. దీంతో శ్రీవాసు కష్టం అంతా వృధా అయ్యినట్లు అయ్యింది. ఇంతకీ ఆ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే.. శ్రీమంతుడు, మహర్షి, శతమానం భవతి కలిపితే ఆ సినిమా కథట. ఈ చిత్రాన్ని ఎప్పటికైనా తీయాలని శ్రీవాసు అనుకున్నాడట. ఈక్రమంలోనే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి కూడా ఒకసారి కథ వినిపించాడట. పవన్ కి కూడా కథ నచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా వర్క్ అవుట్ అవ్వలేదు.
ఇంతలో మహేష్ బాబు (Mahesh Babu).. శ్రీమంతుడు, మహర్షి సినిమాలు, శర్వానంద్ శతమానం భవతి మూవీ రిలీజ్ అవ్వడం, తన సినిమా కథ ఛాయలు ఆ చిత్రాల్లో కనిపించడంతో.. ఇక ఆ కథని పక్కన పెట్టేసినట్లు శ్రీవాసు చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఎన్టీఆర్ ఆ కథకి ఒకే చెప్పుంటే శ్రీమంతుడు, మహర్షి సినిమాలు వచ్చేవి కాదని.. శ్రీవాసు తెలిపాడు.
Also Read : Bigg Boss 7 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7.. 14 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే.. ఎవరెవరు ఉన్నారంటే..