Site icon HashtagU Telugu

Natu-Natu: ఆస్కార్ లో ఆర్ఆర్ఆర్ క్రేజ్.. నాటు-నాటు పాటకు ఎన్టీఆర్, రామ్ చరణ డాన్స్!

Rrr Movie Ticket Rates

Rrr Movie Ticket Rates

`నాటు నాటు` పాట గల్లీ నుంచి హాలీవుడ్ దాకా అందరికీ నచ్చింది. ఈ పాటకు ఎన్టీఆర్, చరణ్ వేసిన స్టెప్పులకు ఇంగ్లిష్ ప్రేక్షకులు కూడా ఫిదా అయి థియేటర్లలో డ్యాన్స్ లు వేశారు. ఇంతటి ఘనవిజయం సాధించిన ఈ పాట ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు గెల్చుకుంది. అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ కూడా దక్కించుకుంది. ఈనెల 12వ తేదీన ఆస్కార్ అవార్డుల విజేతలను ప్రకటించనున్నారు. అయితే ఆస్కార్ అవార్డుల లైవ్ షోలో నాటు నాటు పాట ప్రదర్శించేందుకు ఈ పాటను పాడిన సింగర్లు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలకు ఆస్కార్ నిర్వాహకులు ఇటీవల ఆహ్వానం పలికారు.

ఇప్పుడు మరొక సప్రైజ్ ఏంటంటే.. లైవ్ షోలో రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాట పాడే సమయంలో ఎన్టీఆర్, చరణ్ స్టేజ్ పై డ్యాన్స్ వేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఈ ఇద్దరు హీరోలు సిద్ధం అయినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇండియన్ సినిమా ఆస్కార్ అవార్డుకు నామినేషన్ కావడమే గొప్ప విశేషం అయితే.. లైవ్ షోలో పాట పాడే అవకాశం రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలకు దక్కింది. ఇద్దరు టాలీవుడ్ సింగర్లు ఆస్కార్ వేదికపై పాట పాడే సమయంలో ఇద్దరు సూపర్ స్టార్లు కాలు కదిపితే చూసేందుకు ఇండియాతో పాటు ప్రపంచంలోని సినీ ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.