NTR – Ram Charan : మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపుని సంపాదించుకున్నారు. దీంతో నేషనల్ టు ఇంటర్నేషనల్ లెవెల్ లో వీరి నెక్స్ట్ సినిమాల కోసం ఆసక్తి కనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ తో వీరిద్దరికి వచ్చిన ఇమేజ్ ని కాపాడుకోవాలంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే దేవర డైరెక్ట్ చేస్తున్న కొరటాల శివ, గేమ్ ఛేంజర్ చేస్తున్న శంకర్.. ఇద్దరు ప్లాప్ ల్లో ఉన్నారు.
చిరంజీవితో ఆచార్య సినిమా చేసి భారీ డిజాస్టర్ ని అందుకున్న కొరటాల శివ.. ఇప్పుడు ఎన్టీఆర్ తో దేవర వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇక శంకర్ విషయానికి వస్తే.. రోబో సినిమా తరువాత శంకర్ కి సరైన హిట్ లేదు. కమల్ హాసన్ ఇండియన్ 2తో అయినా హిట్ ట్రాక్ ఎక్కుతారు అనుకుంటే.. అదికూడా ప్లాప్ టాక్ వినిపిస్తుంది. ఇలా ప్లాప్ ల్లో ఉన్న ఇద్దరి దర్శకులకు.. ఎన్టీఆర్ అండ్ చరణ్ తమ కెరీర్ లో కీలక ప్రాజెక్ట్ ని అప్పజెప్పి రిస్క్ తీసుకున్నారు. మరి ఈ రిస్క్ ని జయించి చరణ్ అండ్ ఎన్టీఆర్ బయటపడతారా లేదా చూడాలి.
ఎన్టీఆర్ దేవర సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. సముద్ర తీరాన్న ఉన్న ఒక ట్రైబల్ జాతి చుట్టూ ఈ సినిమా కథ సాగనుందట. తండ్రి కొడుకులుగా ఎన్టీఆర్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 27న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక చరణ్ గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే.. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ఈ మూవీ షూటింగ్ ఇంకా రెండు వారలు బ్యాలన్స్ ఉంది. చరణ్ టాకీ పార్ట్ అయితే పూర్తీ అయ్యింది. ఈ మూవీ రిలీజ్ డేట్ ని ఇంకా ప్రకటించలేదు.