NTR యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత తారక్ చేస్తున్న ఆ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దేవర సినిమాతో మరోసారి తన స్టామినా చూపించాలని ఫిక్స్ అయ్యాడు ఎన్టీఆర్. ఇక ఈ సినిమాతో పాటుగా బాలీవుడ్ లో వార్ 2 సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే. హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ ప్రాజెక్ట్ మీద కూడా భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
వీటితో పాటుగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ సినిమా ఒకటి లైన్ లో ఉంది. మే 20 ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా గురించి అఫీషియల్ అప్డేట్ రాబోతుందని తెలుస్తుంది. సినిమా నుంచి టైటిల్ పోస్టర్ వదులుతారని టాక్. కె.జి.ఎఫ్ రెండు భాగాలతో సత్తా చాటిన ప్రశాంత్ నీల్ సలార్ 1 తో కూడా సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడు.
ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేసే సినిమాకు అప్పట్లో రేడియేటర్ అనే టైటిల్ పెడుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆ టైటిల్ మారినట్టు తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ కోసం డ్రాగన్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నాడట ప్రశాంత్ నీల్. తన సినిమాలన్నీ డార్క్ ఫ్రేం లో చేసే ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ డ్రాగన్ కోసం డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకుంటున్నట్టు తెలుస్తుంది.
సలార్ 2 చేసి ఎన్టీఆర్ తో సినిమా మొదలు పెడతాడా లేదా తారక్ సినిమా పూర్తి చేశాకనే సలార్ 2 చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ఈ కాంబో సినిమా అనేసరికి ఆడియన్స్ లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
Also Read : Satyadev Krishnamma : వారంలోనే OTT రిలీజ్.. సత్యదేవ్ కృష్ణమ్మ మరీ ఇంత ఘోరమా..!