NTR31 vs Salaar2: ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ సినిమాపైనే దృష్టి పెట్టిన ప్రశాంత్ నీల్

RRR తరువాత తదుపరి సినిమాను పట్టాలు ఎక్కించడానికి నందమూరి తారక్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ సినిమాలపై భారీ అంచనాలు నమోదవ్వడంతో కొరటాల తెరకెక్కిస్తున్న దేవర విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

NTR31 vs Salaar2: RRR తరువాత తదుపరి సినిమాను పట్టాలు ఎక్కించడానికి నందమూరి తారక్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ సినిమాలపై భారీ అంచనాలు నమోదవ్వడంతో కొరటాల తెరకెక్కిస్తున్న దేవర విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే ఈ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మేకింగ్ విషయంలో పలు సార్లు షూటింగ్ ఆగిపోయింది. దేవరని ఇప్పుడు రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ ‘వార్ 2’, ‘NTR31’ సినిమాల్లో నటించాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోతున్న ‘NTR31’ కోసం అభిమానులు ఎంతో క్యూరియాసిటీతో చూస్తున్నారు.

కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ లో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ నీల్ తాజాగా ప్రభాస్ తో సలార్ తీసి భారీ హిట్ కొట్టాడు. ఈ చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం.. ఏప్రిల్ నుంచి ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ పైకి రావాల్సింది కానీ.. ఇప్పుడు ఈ సినిమా ఆగిందని టాక్ బలంగా వినిపిస్తోంది.

సలార్ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఆలస్యం చేయకుండా ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకురావాలినే ఒత్తిడి పెరిగిందట. ఆల్రెడీ సలార్ 2 నలభై శాతం కంప్లీట్ అయ్యిందట. అందుచేత మిగిలిన 60 శాతం షూటింగ్ త్వరగా కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారట. ప్రస్తుతం ప్రభాస్ కల్కి షూటింగ్ లో ఉన్నాడు. అలాగే మారుతితో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగ, హను రాఘవపూడి సినిమా చేయాల్సివుంది కానీ.. సలార్ 2 చేయడానికే ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట.

సమ్మర్ తర్వాత సలార్ 2 సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. ప్రశాంత్ నీల్ కూడా ఈ విషయాన్ని ఎన్టీఆర్ కు అలాగే నిర్మాణ సంస్థ మైత్రీకు చెప్పారని సమాచారం. సలార్ సినిమా కంటే ఎక్కువగా సలార్ 2 పై అంచనాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే.. అసలు కథ సలార్ 2 లోనే ఉంది. ఈ సినిమాకి పక్కా ప్లానింగ్ తో ప్రమోషన్స్ చేయాలి అనుకుంటున్నారట. అంతా అనుకున్నట్టుగా ప్రమోషన్స్ భారీగా చేసి రిలీజ్ చేస్తే.. సలార్ 2 సంచలన విజయం ఖాయం.

Also Read: Shoaib Malik Extramarital Affairs: షోయ‌బ్ మాలిక్ వివాహానికి కుటుంబ స‌భ్యులు కూడా రాలేదా..? ఎందుకు..?