దండోరా సినిమా పై ఎన్టీఆర్ ప్రశంసలు..

Jr NTR praises Dhandoraa శివాజీ, బిందు మాధవి, నవదీప్, నందు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘దండోరా’. గత నెలలలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాకి మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఈ మూవీకి జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు దక్కాయి. డైరెక్టర్ మురళీ కాంత్ బలమైన కథను అద్భుతంగా తెరకెక్కించారని, ప్రధాన నటీనటులందరూ చాలా బాగా నటించారని కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ […]

Published By: HashtagU Telugu Desk
Jr Ntr Praises Dhandoraa

Jr Ntr Praises Dhandoraa

Jr NTR praises Dhandoraa శివాజీ, బిందు మాధవి, నవదీప్, నందు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘దండోరా’. గత నెలలలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాకి మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఈ మూవీకి జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు దక్కాయి. డైరెక్టర్ మురళీ కాంత్ బలమైన కథను అద్భుతంగా తెరకెక్కించారని, ప్రధాన నటీనటులందరూ చాలా బాగా నటించారని కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.

బలమైన కంటెంట్ తో రూపొందిన చిన్న సినిమాలకు ఎప్పుడూ ప్రేక్షకాదరణ దక్కుతూ ఉంటుంది. ‘దండోరా’ చిత్రం ఈ కోవలోకే వస్తుంది. శివాజీ, బిందు మాధవి, నవదీప్, నందు, రవి కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. సామాజిక అంశాలను స్పృశిస్తూ, కమర్షియల్ హంగులతో సహజత్వానికి దగ్గరగా ఉండేలా ఈ సోషల్ ఎమోషనల్ డ్రామాని రూపొందించారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఓటీటీలోనూ ఈ చిత్రానికి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశంసలు దక్కాయి.

మంచి సినిమాల‌ను సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ ముందుండే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్.. తనకు నచ్చిన సినిమాలను సోషల్ మీడియా వేదికగా అభినందిస్తుంటారు. ఈ క్రమంలో రీసెంట్‌గా ఆయన ‘దండోరా’ సినిమా చూశారు. ఎక్స్ (ట్విట్ట‌ర్‌)లో సినిమాపై తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. నటీనటుల పర్ఫార్మెన్స్ లను అభినందిస్తూ పోస్ట్ పెట్టారు. క‌థ‌, క‌థ‌నం, పాత్ర‌ల తీరు తెన్నులు, సాంకేతిక నిపుణుల ప‌నితీరును మెచ్చుకున్నారు.

ఇప్పుడే ‘దండోరా’ సినిమా చూశాను. ఇది చాలా లోతుగా ఆలోచింపజేసే, పవర్ ఫుల్ మూవీ. శివాజీ గారు, నవదీప్, నందు, రవి కృష్ణ, బిందు మాధవి.. అందరి నటన సినిమా అంతటా అద్భుతంగా ఉంది. ఇలాంటి రూటెడ్ క‌థ‌ను రాసి, బలమైన వాస్తవిక కథను ఇంత చక్కగా తెరకెక్కించినందుకు దర్శకుడు మురళీ కాంత్ గారికి హ్యాట్సాఫ్. ఈ ప్రయత్నానికి మద్దతు ఇచ్చినందుకు నిర్మాత రవీంద్ర బెనర్జీ గారికి అభినందనలు. ఇంతటి విశిష్టమైన చిత్రానికి మద్దతు ఇచ్చి, ఇందులో భాగమైన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ హృదయపూర్వక అభినందనలు అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ నేప‌థ్యంతో రూటెడ్ క‌థాంశంతో ‘దండోరా’ సినిమా రూపొందింది. కలర్ ఫొటో, ‘బెదురులంక 2012’ వంటి డిఫరెంట్ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని దండోరా సినిమాను నిర్మించారు. కుల వివ‌క్ష‌ను ప్ర‌శ్నించేలా, అంద‌రినీ ఆలోచింప చేసేలా రూపొందిన సినిమా ఇది. మార్క్ కె.రాబిన్ సంగీతం సమకూర్చగా.. వెంకట్ ఆర్.శాఖ‌మూరి సినిమాటోగ్ర‌ఫీ నిర్వహించారు.

  Last Updated: 20 Jan 2026, 10:44 AM IST