Site icon HashtagU Telugu

NTR Penned: నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను!

Junior

Jrntr

ఎన్టీఆర్ ఈరోజు తన 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఇటీవల విడుదల అయిన RRR సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్నాడు. తన పుట్టినరోజున తనపై అపారమైన ప్రేమను కురిపించినందుకు  అభిమానులు, స్నేహితులు, కుటుంబం, ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ ట్విట్టర్‌లో ఎన్టీఆర్ పోస్ట్ చేశాడు. “మీ అందరికీ శుభాకాంక్షలు తెలిపినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే, నా ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు నా కృతజ్ఞతలు. మీ అభిమానం నా హృదయాన్ని కదిలించింది. పుట్టినరోజును ప్రత్యేకంగా చేసింది.

నేను ఇంట్లో లేనందున మీ అందరినీ కలవలేకపోయినందుకు క్షమించండి. మీ ప్రేమ, మద్దతు, ఆశీర్వాదాలకు నేను కృతజ్ఞుడను. నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను.” అంటూ రాసుకొచ్చారు. తన బర్త్ డే సందర్భంగా తన అభిమానుల మొదలుకొని.. హీరోల దాకా ఎంతోమంది శ్రేయోభిలాషుల గ్రీటింగ్స్ ను అందుకున్నాడు. బర్త్ డే కానుకగా వివిధ సినిమాల పోస్టర్లను రిలీజ్ చేయడంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్సాహం నింపినట్టయింది.

Exit mobile version