NTR On Mokshagna Entry : మోక్షజ్ఞకు శుభాకాంక్షలు తెలిపిన జూ. ఎన్టీఆర్

Jr NTR Wishes To Mokshagna - 'నటనలో తాతగారిలా పేరు తెచ్చుకోవాలి. ఆయన ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి. హ్యాపీ బర్త్ డే మోక్షు' అని ఎన్టీఆర్ స్వాగతం పలుకుతూ ట్వీట్

Published By: HashtagU Telugu Desk
Ntr Tweet On Mokshagna Entr

Ntr Tweet On Mokshagna Entr

TR On Mokshagna Entry : సినీ ఎంట్రీ ఇచ్చిన నందమూరి మోక్షజ్ఞ (Nandhamuri Mokshagna )కు ఆయన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ (NTR) శుభాకాంక్షలు తెలిపారు. ‘నటనలో తాతగారిలా పేరు తెచ్చుకోవాలి. ఆయన ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి. హ్యాపీ బర్త్ డే మోక్షు’ అని ఎన్టీఆర్ స్వాగతం పలుకుతూ ట్వీట్ చేశారు. నందమూరి అభిమానులంతా గత కొన్నేళ్లుగా బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్బంగా తన ఎంట్రీపై అధికారికంగా ప్రకటించారు.

ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి, తేజస్విని సంయుక్తంగా నిర్మాణంలో భారీ బడ్జెట్ తో రూపొందనుంది. సినిమాటిక్ యునివర్స్ లో భాగంగా ఈ ప్యాన్ ఇండియా మూవీని సోసియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్, విఎఫెక్స్ ఎఫెక్ట్స్ తో రూపొందించనున్నారు. హీరోయిన్ గా కొత్తమ్మాయిని సెట్ చేసే పనిలో ఉన్నారు. దీనికి సంబంధించి వివరాలు త్వరలో తెలియపరచనున్నారు.

ఇక మోక్షజ్ఞ ఎంట్రీ పై సినీ ప్రముఖులు (Tollywood Celebrities) ట్వీట్ చేస్తూ అల్ ది బెస్ట్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మోక్షజ్ఞకు ఆయన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘నటనలో తాతగారిలా పేరు తెచ్చుకోవాలి. ఆయన ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి. హ్యాపీ బర్త్ డే మోక్షు’ అని ఎన్టీఆర్ స్వాగతం పలుకుతూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ స్పందనతో నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా, ‘తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. మొన్నటి వరకు బాబాయ్ – ఎన్టీఆర్ మధ్య కాస్త దూరం ఉండేది..కానీ ఇప్పుడు ఈ ట్వీట్ తో దగ్గర అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

Read Also : Floods: జగనన్న సంస్కరణలే వరద కష్టాల నుండి ప్రజలను గట్టెక్కిస్తున్నాయి: రోజా

  Last Updated: 06 Sep 2024, 04:06 PM IST