Site icon HashtagU Telugu

Ntr On Drug Awareness : డ్రగ్స్‌కి బానిస కావద్దంటూ దేవర పిలుపు

Ntr Drug

Ntr Drug

డ్రగ్స్ (Drug ) రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి (Telangana Govt) యువత సహకరించాలంటూ దేవర పిలుపునిచ్చారు. డ్రగ్స్ విషయంలో తెలంగాణ సర్కార్ చాల కఠినంగా ఉన్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ మహమ్మారి వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అవుతున్నాయని..రాష్ట్రంలో ఎక్కడ డ్రగ్స్ అనే మాట వినపడొద్దని , కనిపించకూడదని మొదటి నుండి ఆదేశిస్తూ వస్తుంది. రాష్ట్రంలో ఎక్కడిక్కడే డేగ కన్ను తో డ్రగ్స్ ను నిర్మిలిస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

ఇటీవలే సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఓ కార్యక్రమంలో డ్రగ్స్​, సైబర్​ క్రైమ్​పై సినీ పరిశ్రమ యువతకు అవగాహన కల్పించాలని సూచించిన విషయం తెలిసిందే. టికెట్​ రేట్ల పెంపునకు అనుమతి అంటూ వచ్చే వారికి ఆయన ఓ షరతు పెట్టారు. సినిమాలో నటించే వారితో డ్రగ్స్​, సైబర్​ నేరాలపై రెండు నిమిషాల అవగాహన వీడియో చిత్రీకరించాలని సూచించారు. సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సినీ పరిశ్రమపై ఉందని తెలిపారు. దీంతో సీఎం రేవంత్ పిలుపు మేరకు సినీ ప్రముఖులు భాగస్వామ్యం అవుతున్నారు. ఇప్పటికే చిరంజీవి సహా పలువురు స్టార్‌ నటులు భాగస్వామ్యం అయిన విషయం తెలిసిందే. తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) సైతం తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలిపారు. డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని పిలుపునిచ్చారు.

‘మన దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసమో, క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడేందుకో, లేదంటే స్నేహితుల ప్రభావం వల్లనో, స్టైల్ కోసమే మాదక ద్రవ్యాలకు ఆకర్షితులవుతుండడం చాలా బాధాకరం. జీవితం చాలా విలువైనది. రండి.. నాతో చేతులు కలపండి. డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంతో భాగస్వాములు అవ్వండి. రాష్ట్రంలో ఎవరైనా డ్రగ్స్‌ విక్రయిస్తున్నా, కొనుగోలు చేస్తున్నా, వినియోగిస్తున్నా.. వెంటనే యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరోకు సమాచారం ఇవ్వండి’ అని ఎన్టీఆర్‌ పిలుపునిచ్చారు. డ్రగ్స్‌ రహిత తెలంగాణకై యాంటీ నార్కోటిక్‌ టీమ్‌ (Telangana Anti Narcotics Bureau)కు సహకరిస్తూ తనవంతు బాధ్యతగా ఎన్టీఆర్‌ ఈ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

ఇక ఎన్టీఆర్ (NTR) నటించిన దేవర (Devara) చిత్రం ఈ నెల 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటీకే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగా..హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

Read Also : Devara : ‘దేవర’ ఈవెంట్ రద్దు కావడానికి కారణం..రేవంత్ ప్రభుత్వమే – కేటీఆర్