తెలుగు సినిమా (Tollywood) ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ (NTR) ఇప్పుడు తన కొత్త లుక్‌తో అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు. ఇటీవల జరిగిన ‘మ్యాడ్ స్క్వేర్’ (MAD Square) మూవీ సక్సెస్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా హాజరైన ఎన్టీఆర్ ..తన లుక్ (NTR New Look) అందరినీ మెస్మరైజ్ చేసింది. ఇప్పటివరకు మస్కులర్ బాడీతో ఆకట్టుకున్న తారక్ ఇప్పుడు చాలా సన్నగా మారిపోయాడు. అభిమానులు మాత్రం ఈ సడెన్ ట్రాన్స్ఫర్మేషన్‌పై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఆయన బాడీలో భారీ మార్పులు చేసుకుంటున్నారని సమాచారం. ఇంతకు ముందు ‘దేవర’ సినిమాలో అద్భుతమైన బాడీతో కనిపించిన ఎన్టీఆర్ ఇప్పుడు మాత్రం స్లిమ్ లుక్‌తో కనిపించడంతో, ఇది సినిమాలో పాత్ర కోసం చేశారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కథ డిమాండ్ మేరకే తారక్ తన ఫిజిక్ మార్చుకున్నారనే అభిప్రాయాలు ఫిలింనగర్‌లో వినిపిస్తున్నాయి.
అభిమానులలో కొంతమంది “ఎన్టీఆర్ మునుపటి లుక్‌లోనే బాగుండేవాడు” అంటుండగా, మరికొంతమంది మాత్రం “ఇలా సన్నగా మారిన తారక్ చాలా స్టైలిష్‌గా ఉన్నాడు” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే నిజంగా ఆయన లుక్‌కి వెనక కారణం ఏమిటో తెలుసుకోవాలంటే ప్రశాంత్ నీల్ సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.