తెలుగు సినీ పరిశ్రమలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) తన ప్రతిభతోనే కాక, తనస్టైల్‌తోనూ అభిమానులను ఆకట్టుకుంటుంటాడు. తాజాగా జూబ్లీహిల్స్‌లో ఉన్న తన ఇంటిని పూర్తిగా పునరుద్ధరించి, కొత్త లుక్ ను తీసుకొచ్చాడు. కొద్ది నెలలుగా ఈ ఇంటి రెనోవేషన్ పనులు కొనసాగగా, ఇప్పుడు అది పూర్తయ్యింది. ఈ కొత్త ఇంటిలో తారక్ – ప్రణతి జంట తమ అభిరుచులకు అనుగుణంగా ఇంటీరియర్ డిజైన్ చేయించారని సమాచారం. ఫ్లోరింగ్, వాల్ డెకరేషన్, లైటింగ్, షాండ్లియర్స్ మొదలైన ప్రతి కోణంలోనూ ఇంటి రూపురేఖలను ఆధునిక శైలిలో తీర్చిదిద్దారు.
ఈ కొత్త ఇంట్లోకి ఇటీవలే ఎన్టీఆర్ ఫ్యామిలీ షిఫ్ట్ కావడంతో ఇంటి పరిసరాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు సందడి చేశారు. ఇంట్లో ప్రతీ గదికీ ప్రత్యేక డిజైన్ ఉండేలా చూసిన తారక్ దంపతులు, తమ అభిరుచులను ప్రతిబింబించేలా ఇంటిని తీర్చిదిద్దారు. ముఖ్యంగా మోడర్న్ టచ్‌తో కలసిన డిజైనింగ్, హోమ్ డెకోర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫోటోల్లో కనిపిస్తున్న లైటింగ్, ఫర్నిచర్, వాల్ ప్యానల్స్ ఎన్టీఆర్ అభిరుచిని ప్రతిబింబిస్తున్నాయి.
HHVM 2 : ‘వీరమల్లు 2 ‘అనేది మరచిపోవాల్సిందేనా..?
ఈ రెనొవేషన్ కోసం భారీ స్థాయిలో ఖర్చు పెట్టినట్టు సమాచారం. ఎన్టీఆర్ గతంలో మినిమలిస్ట్ లైఫ్‌స్టైల్‌కి కట్టుబడి ఉండేవాడు. కానీ ఈసారి తన ఇంటిని ప్రీమియం లెవెల్లో మార్చుకున్నాడు. తారక్ హై క్లాస్ ఇంటీరియర్ డిజైన్ కోసం ప్రత్యేక బృందాన్ని నియమించి, నెలల పాటు పనులు చేయించారట. తారక్ ఫ్యామిలీకి ఇది కొత్త అధ్యాయం లాంటిదిగా మారిందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన వార్ 2 ఆగస్టులో విడుదల కానుంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ సినిమా వచ్చే ఏడాది జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల శివతో దేవర 2, త్రివిక్రమ్‌తో ఓ సినిమా, ఎల్సన్ డైరెక్షన్‌లో మరో ప్రాజెక్టు చేస్తున్నారు. సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా, వ్యక్తిగత జీవితంలోనూ తారక్ తన స్థాయిని ప్రతిబింబించేలా కొత్త ఇంటిని అద్భుతంగా తీర్చిదిద్దాడని చెప్పొచ్చు.