NTR Likes Kumari Aunty Curries : గత రెండు రోజులుగా ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కుమారి ఆంటీ గురించే స్పెషల్ న్యూస్ వైరల్ అయ్యింది. కొండపూర్ లో రోడ్ సైడ్ ఫుడ్ ని నడుపుతున్న ఆమె దగ్గర భోజనం చేసిన వారంతా కుమారీ ఆంటీ భోజనం అంటే సూపర్ అనేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఇన్ స్టాలో ఆమె చాలా పాపులర్ అయ్యింది. ఈమధ్య సందీప్ కిషన్ భైరవ కోన టీం కూడా ఆమె దగ్గరకు వెళ్లింది. అయితే అంత ఫేమస్ అయిన ఆమె దగ్గర భోజనం కోసం అందరు క్యూ కడుతున్నారు.
We’re now on WhatsApp : Click to Join
దాని వల్ల కుమారి ఆంటీ హోటల్ దగ్గర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. రీసెంట్ గా పోలీసులు ఆమె హోటల్ ని మూసివేయాలని చూశారు. అయితే ఈ న్యూస్ ఆనోటా ఈ నోటా పడి సీఎం దృష్టి వెళ్లింది. రోడ్ సైడ్ భోజనం పెట్టే ఆమె పొట్ట కొట్టడం ఎందుకని సీఎం రేవంత్ రెడ్డి ఆమె హోటల్ ని ఏమి చేయొద్దని ఆర్డర్స్ వేశారు.
దాంతో కుమారి ఆంటీ హోటల్ మరింత ఫేమస్ అయ్యింది. ఆమె చేసే వంటలే కాదు ఆమె చెప్పే మాటలు కూడా అక్కడ జనాలను ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఆమె హోటల్ కి అందరు ఎగబడుతున్నారు. ఇదిలాఉంటే లేటెస్ట్ గా ఈమె హోటల్ ఫుడ్ గురించి తెలుసుకున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కూడా కుమారి ఆంటీ నుంచి భోజనం, ఇంకా కర్రీస్ తెప్పించుకున్నాడని టాక్.
ఎన్టీఆర్ డ్రైవర్ తో ఈ పార్సిల్స్ అందుకున్నాడట. ఎన్.టి.ఆర్ మంచి భోజన ప్రియుడని తెలిసిందే కదా.. అందుకే ఇంతమంది ఇన్ని విధాలుగా చెబుతున్నారు కాబట్టి కుమారి ఆంటీ భోజన రుచిని చూడాలని తారక్ అనుకున్నాడు. అందుకే డ్రైవర్ తో ఆమె భోజనాన్ని కర్రీస్ ని స్పెషల్ గా ఎప్పించుకున్నాడని తెలుస్తుంది.
Also Read : Tripti Dimri : అలాంటోడినే పెళ్లి చేసుకుంటా.. యానిమల్ బ్యూటీ త్రిప్తి కాబోయే వాడు ఎలా ఉండాలంటే..!