Jr NTR Talks: ఆ సినిమా కేజీఎఫ్ కు మించి ఉంటుంది.. ‘ఆర్ఆర్ఆర్’ ఓ సిండ్రెల్లా కథ!

జనవరి 7, 2022.. ఈ తేదీ కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ‘బాహుబలి’ తర్వాత దర్శకుడు S.S రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్టాత్మక మూవీ RRR కాబట్టి. టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ జూనియర్‌ “అరవింద సమేత వీర రాఘవ”

  • Written By:
  • Updated On - November 24, 2021 / 05:45 PM IST

జనవరి 7, 2022.. ఈ తేదీ కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ‘బాహుబలి’ తర్వాత దర్శకుడు S.S రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్టాత్మక మూవీ RRR కాబట్టి. టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ “అరవింద సమేత వీర రాఘవ” తర్వాత నటిస్తున్న చిత్రం కూడా ఇదే. తన తాత నందమూరి తారక రామారావు నట పుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ పౌరాణిక చిత్రం “బ్రహ్మర్షి విశ్వామిత్ర” (1991)లో బాల నటుడిగా ప్రవేశించాడు. “RRR” ఎన్టీఆర్ కు 29వ చిత్రం. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు కొమరం భీమ్ పాత్రను పోషించాడు.  ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ అనుభవాలను, రాజమౌళితో జర్నీ గురించి, తన తదుపరి ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడారు.

నవంబర్ 2018లో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రారంభమైంది. కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. “RRR” కోసం విడుదల చేసిన మొదటి ఫుటేజ్‌లో ఒక పాట ఉంది. ఇది ఉక్రెయిన్‌లోని కీవ్‌లో షూటింగ్ జరుపుకుంది. ఎందుకంటే కొవిడ్ మహమ్మారి కారణంగా ఇండియాలో షూట్ చేయడం సాధ్యంకాలేదు. ఈ పాటకు విదేశీ డాన్సర్ల అవసరం కూడా ఉంది.నాటు నాటు పాట కోసం ఎన్నో టేక్ లు తీసుకోవాల్సి వచ్చింది. కాలు ఎడమ, కుడి ముందు వెనక్కు టర్న్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం దాదాపు 18 టేక్స్ తీసుకున్నాం. రాంచరణ్ తో సింక్ అయ్యేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇదరి టైమింగ్ బాగుంటేనే డాన్స్ ఫర్ఫెక్ట్ వస్తుంది. అందుకే ఈ పాట కోసం 12 గంటలు షూటింగ్ చేయాల్సి వచ్చింది.

“పాట విడుదలైనప్పుడు నేను ఆన్ లైన్ లో వాచ్ చేశాను. నా అభిమానులతో పాటు చరణ్ అభిమానలకు విపరీతంగా నచ్చింది. ఇద్దరి సింక్ బాగుందని కామెంట్స్ చేశారు. దేశంలో నెంబర్ వన్ కొరియోగ్రాఫర్ చేత ఈ పాట తెరకెక్కింది. ఇప్పటివరకు YouTubeలో 26 మిలియన్ల కంటే ఎక్కువ సార్లు వీక్షించిన పాట ఇది. ఇక డైరెక్టర్ రాజమౌళితో పనిచేయడం నాకు కొత్తేమీ కాదు. అందుకే ఆర్ఆర్ఆర్ కోసం ముందుగానే సిద్దమయ్యా. షూటింగ్ కంప్లీట్ చేయడానికి చాలా నిరీక్షించాల్సి వచ్చింది. ఇదంతా ఫర్ఫెక్షన్ కోసమే. 2001లో “స్టూడెంట్ నంబర్ 1,” విడుదలయ్యింది. హీరోగా నాకు, డైరెక్టర్ గా రాజమౌళికి మంచి సక్సెస్ ను ఇచ్చింది. “ప్రతి విజయం మా లక్ష్యాన్ని మరికొంత కాలం కొనసాగాలనే కోరికను బలపర్చింది. ‘RRR’ చేస్తున్నప్పుడు, ఇది మనకు సిండ్రెల్లా కథ. ఇది అద్భుతమైన ప్రయాణం.” స్టార్ గా పేరు తెచ్చుకోవడం కంటే నటుడిగా పేరు తెచ్చుకోవడమే నాకిష్టం.

 

ఇక నా నెక్ట్స్ మూవీ “ఎన్టీఆర్ 30” “జనతా గ్యారేజ్” దర్శకుడు కొరటాల శివతో పనిచేస్తున్నా. ఈ చిత్రం రివెంజ్ డ్రామా. 2022 ఫిబ్రవరిలో ప్రారంభిస్తాం. అలాగే కేజీఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తోనూ సినిమా ఉంది. ఇది 31 చిత్రం. “కెజిఎఫ్” స్థాయిలో ఉంటుందని. అక్టోబర్ 2022లో నిర్మాణాన్ని ప్రారంభిస్తామని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు.