Site icon HashtagU Telugu

Devara Trailer : దేవర ట్రైలర్ వచ్చేసింది.. షాట్స్ అదిరిపోయాయిగా..

NTR Janhvi Kapoor Devara Trailer Released

Devara Trailer

Devara Trailer : ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న దేవర ట్రైలర్ వచ్చేసింది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రెండు పార్టులుగా తెరకెక్కుతున్న దేవర సినిమా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా దేవర ట్రైలర్ విడుదల చేసారు. మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి..

 

ట్రైలర్ చూస్తుంటే కొరటాల శివ ఓ ప్రత్యేకమైన ప్రపంచం సృష్టించారు. ప్రకాష్ రాజ్ గంభీరమైన వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలైంది. ఎన్టీఆర్ తండ్రి కొడుకులు పాత్రల్లో కనిపించబోతున్నాడని తెలుస్తుంది ట్రైలర్ చూస్తుంటే. ఒక తీర ప్రాంతం ఊరు, కొందరు సముద్రపు దొంగలు, వారికి ఎన్టీఆర్ భయాన్ని పరిచయం చేయడం, ఒక ఎన్టీఆర్ పాత్ర భయస్తుడిగా, జాన్వీతో ప్రేమ.. ఇలా అన్ని అంశాలు చూపించారు.

ట్రైలర్ చూస్తుంటే.. ఒక ఊర్లో విలన్ ని భయపెట్టిన హీరోని ఏదో రకంగా విలన్ చంపేస్తే అతని కొడుకు ఎలా పగ తీర్చుకున్నాడు అనేలా ఉండబోతుందనిపిస్తుంది. విజువల్ గా మాత్రం దేవర ఒక వండర్ లా ఉండబోతుందని ట్రైలర్ చూస్తేనే అర్థమయిపోతుంది. ఇక చివర్లో సొరచేప మీద ఎన్టీఆర్ సవారీ చేసే షాట్ అయితే అదిరిపోయింది. మరి థియేటర్స్ లో దేవర ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి. ఇక సినిమాలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, అజ‌య్.. ఇలా అచలా మంది స్టార్స్ ఉన్నారు.

 

Also Read : NTR Devara Runtime : దేవర ఫ్యాన్స్ ని భయపెడుతున్న రన్ టైం..!