Devara Song : ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులని మెప్పించి సినిమాపై అంచనాలు పెంచాయి. గత రెండు రోజులుగా దేవర సినిమా నుంచి మూడో సాంగ్ రాబోతుందని, ఇందులో ఎన్టీఆర్ స్టెప్స్ అదిరిపోతాయని దేవర మూవీ యూనిట్ సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది.
దేవర మూడో సాంగ్ దావూదీ.. అంటూ సాగనుందని పలు పోస్టర్స్ కూడా రిలీజ్ చేసింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సాంగ్ కోసం, ఎన్టీఆర్ స్టెప్స్ కోసం ఎదురుచూసారు. తాజాగా దేవర మూడో సాంగ్ రిలీజ్ చేసారు. ఈ సాంగ్ లో ఎన్టీఆర్ తన పాత స్టయిల్లో స్టెప్పులు అదరగొట్టేసాడు. ఎన్టీఆర్ తో పాటు జాన్వీ కూడా డ్యాన్స్ అదరగొట్టేసింది.
మీరు కూడా దేవర మూడో సాంగ్ వినేయండి..