Site icon HashtagU Telugu

Devara : ‘దేవ‌ర’ సెకండ్ సింగల్ రిలీజ్.. ఎన్టీఆర్, జాన్వీ రొమాన్స్ మాములుగా లేదుగా..

Ntr, Janhvi Kapoor, Devara, Chuttamalle Song

Ntr, Janhvi Kapoor, Devara, Chuttamalle Song

Devara : కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్, జాన్వీ క‌పూర్ హీరోహీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం ‘దేవర’. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ రెండు భాగాలుగా రాబోతుంది. మొదటి భాగం సెప్టెంబ‌ర్ 27న రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ షూటింగ్ పూర్తీ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ తొలి భాగం ప్రమోషన్స్ ని కూడా మూవీ టీం స్టార్ట్ చేసింది. ఈక్రమంలోనే సాంగ్స్ ని రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

ఫియర్ సాంగ్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేసిన అనిరుద్.. ఇప్పుడు సెకండ్ సింగల్ ని మెలోడీతో ఆకట్టుకోబోతున్నారు. ‘చుట్టమల్లె చుట్టేస్తాంది’ అంటూ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ తో పాట ఆకట్టుకునేలా ఉంది. ఇక పాటలో ఎన్టీఆర్ అండ్ జాన్వీ మధ్య రొమాన్స్ అయితే మాములుగా లేదు. అందమైన బీచ్ లొకేషన్స్ లో ఎన్టీఆర్ అండ్ జాన్వీతో కొరటాల తెరకెక్కించిన ఈ పాట అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. ఆ పాట వైపు మీరు ఓ లుక్ వేసేయండి.

కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడని సమాచారం. తండ్రి కొడుకుల పాత్రలని ఎన్టీఆర్ చేస్తున్నారట. గతంలో ఆంద్రవాల సినిమాలో కూడా ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటించారు. అయితే ఆ సినిమాలో అది వర్కౌట్ అవ్వలేదు. మరి ఈ చిత్రంలో అయినా అది వారౌట్ అవుతుందా లేదా చూడాలి. ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ తరువాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. దేవర పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను కూడా దేవర టీం అందుకుంటుందా అనేది చూడాలి.