Devara : కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుంది. ఈ ఏడాది మే నెలలోనే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం.. షూటింగ్ పూర్తి చేసుకోలేకపోవడంతో అక్టోబర్ కి పోస్టుపోన్ అయ్యింది. ఆ తరువాత సెప్టెంబర్ కి ప్రీపోన్ చేసి అభిమానులను ఖుషి చేసారు. రిలీజ్ కి ఇక రెండు నెలలు సమయం మాత్రమే ఉంది. మరి సినిమా చిత్రీకరణ ఎంత వరకు వచ్చింది..? ఇంకెన్ని రోజులు షూటింగ్ చేయాలి..?
సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ చివరికి వచ్చేసిందట. ప్రస్తుతం సాంగ్స్ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ.. మరో రెండు పాటలు షూటింగ్ జరుపుకోవాల్సి ఉందట. ఈ రెండు పాటలకు గాను పది, పదిహేను రోజులు సమయం పడుతుందని సమాచారం. అంటే మరో రెండు వారాల్లో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానుందని తెలుస్తుంది. ఇక ఈ రెండు నెలల సమయంలో మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పై ఫుల్ ఫోకస్ పెడతారా..? లేదా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ తో పాటు సెకండ్ పార్ట్ షూటింగ్ ని కూడా జరుపుతూ వస్తారా..? అనేది చూడాలి.
కాగా ఈ మూవీ నుంచి ఇప్పటికే మొదటి సాంగ్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ‘ఆల్ హెయిల్ టైగర్’ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్యూన్ అందించారు సంగీత దర్శకుడు అనిరుద్. ఇప్పుడు రెండో సాంగ్ ని రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నారట. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడిగా జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరితో సముద్రం ఒడ్డున ఒక అందమైన రొమాంటిక్ సాంగ్ ని చిత్రీకరించారట. త్వరలోనే ఈ పాట రిలీజ్ కి సంబంధించిన అప్డేట్ ని ఇవ్వనున్నారట.