Site icon HashtagU Telugu

Jr NTR: కుటుంబ సమేతంగా దుబాయ్ వెళ్లిన ఎన్టీఆర్, ఎందుకో తెలుసా!

Jr NTR wants to become producer and make movies

Jr NTR wants to become producer and make movies

ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్’ (సైమా)ను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఏడాది వేడుకలకు దుబాయ్ వేదిక కానుంది. ఇందులో పాల్గొనేందుకు ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లారు.  ఎన్టీఆర్ కుటుంబ సమేతంగా ఈరోజు దుబాయ్ బయలుదేరారు.  సెప్టెంబర్ 15, 16 తేదీల్లో దుబాయ్‌లో జరగనున్న SIIMA వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు.

సైమా అవార్డుల వేడుకలో ఎన్టీఆర్‌తో పాటు హీరోలు యష్, రిషబ్ శెట్టి, హీరోయిన్లు మృణాల్ ఠాకూర్, శ్రీల కూడా పాల్గొననున్నారు. అలాగే ఈ ఏడాది సైమా అవార్డ్స్‌లో ‘RRR’ 11 విభాగాల్లో నామినేషన్లు అందుకుంది. తెలుగులో ఉత్తమ నటుడి విభాగంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, నిఖిల్, సిద్దు జొన్నలగడ్డ, దుల్కర్ సల్మాన్, అడివి శేష్ పోటీ పడుతున్నారు. సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ సినిమాతో బిజీగా ఉన్నాడు.

కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. తారక్‌కి అండర్‌వాటర్‌ ఫైటింగ్‌ సీన్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఎన్టీఆర్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ముంబై నుంచి తీసుకొచ్చిన ట్రైనర్ల దగ్గర ఎన్టీఆర్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఈ సీన్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కాగా చంద్రబాబు అరెస్ట్ పై జూనియర్ స్పందించకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. అయితే రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నట్టు జూనియర్ పేర్కొనప్పటికీ, ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఏపీ పరిస్థితులపై సైలంట్ గా ఉన్నా జూనియర్ దేవర షూటింగ్ లో పాల్గొనడం గమనార్హం. తాజాగా దుబాయ్ వెళ్లడంపై జూనియర్ పై సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.